మహబూబ్ నగర్ లో ఈ సిగరెట్లు తాగుతున్న స్కూల్ పిల్లలు... ఈగల్ టీం దాడులు.. ముగ్గురు అరెస్ట్.. 

మహబూబ్ నగర్ లో ఈ సిగరెట్లు తాగుతున్న స్కూల్ పిల్లలు... ఈగల్ టీం దాడులు.. ముగ్గురు అరెస్ట్.. 

మహబూబ్ నగర్ లో గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు దారి తప్పుతున్నారు. స్కూల్ సమీపంలో ఉన్న పాన్ షాపుల్లో ఈ సిగరెట్లు కొని తాగుతున్నారు విద్యార్థులు. ఈ క్రమంలో ఆకస్మిక దాడులు నిర్వహించిన ఈగల్ టీం పోలీసులు ముగ్గురు పాన్ షాప్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ఆదివారం ( మార్చి 1 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..  

మహబూబ్ నగర్ ZPHS స్కూల్ కి సమీపంలో ఉన్న పాన్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు ఈగల్ టీం పోలీసులు. స్కూల్ పిల్లలకు ఈ సిగరెట్లు అమ్ముతున్న ముగ్గురు పాన్ షాప్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు పోలీసులు. స్కూల్ కి వంద మీటర్ల దూరంలోనే ఉన్న పాన్ షాపుల్లో ఈ సిగరెట్లు కొని యథేచ్ఛగా తాగుతున్నారు పిల్లలు. గత కొన్ని నెలలుగా స్కూల్ పిల్లలు ఈ సిగరెట్లు తాగుతున్నట్లు తెలిపారు స్థానికులు.

ఈ ఘటనపై స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఈగల్ టీం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. స్కూల్ పిల్లలకు ఈ సిగరెట్లు విక్రయిస్తున్న ముగ్గురు పాన్ షాప్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.