నటి ప్రియా భవానీ శంకర్ ఇన్​స్పైరింగ్​ జర్నీ

నటి ప్రియా భవానీ శంకర్ ఇన్​స్పైరింగ్​ జర్నీ

న్యూస్ రీడర్​గా కెరీర్ మొదలుపెట్టింది. కానీ, ఇప్పుడు తనే ఒక న్యూస్​ అయ్యేలా ఎదిగింది. ఇదేదో సినిమా కథలా ఉంది అనుకుంటున్నారా! కాదు. ఇది ప్రియా భవానీ శంకర్ అనే నటి ఇన్​స్పైరింగ్​ జర్నీ. పదేండ్ల కింద ఉద్యోగంలో భాగంగా తమిళ హీరో ధనుష్ లాంటి స్టార్ హీరోలను ఎందరినో ఇంటర్వ్యూ చేసిన ఆమె,  ఇప్పుడు ఆ త‌‌‌‌మిళ స్టార్స్ అంద‌‌‌‌రితో న‌‌‌‌టిస్తోంది.

‘‘కొందరికి నేనేం చేసినా నచ్చుతుంది.  అలాగే, నేను ఈ సక్సెస్ కి అర్హురాలిని కాదని నమ్మే కొంతమంది కూడా నాకు తెలుసు. ఈ కెరీర్​ నేను ప్లాన్ చేసుకున్నది కాదు. ఏ అవకాశంవచ్చినా దానికోసం వందశాతం కష్టపడటమే నాకు తెలిసిన ఫార్ములా. ఈ ఏడాది నేను చేసిన ‘హాస్టల్’ ‘యానై’ ‘కురుతి ఆట్టమ్’ ధనుష్​ హీరోగా చేసిన‌‌‌‌ ‘తిరుచిత్రాంబళం’ వరుసగావిడుదలయ్యాయి. ఈ సినిమాలు నాకు మంచి పేరు తెచ్చాయి. ‘తిరుచిత్రాంబళం’ సినిమా సూప‌‌‌‌ర్ హిట్ అయింది. ఈ ఆగస్టులో సోనీ లివ్​లో ‘విక్టిమ్– హూ ఈజ్ నెక్స్ట్‌’ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చేశా. న‌‌‌‌లుగురు డైరెక్టర్లు నాలుగు క‌‌‌‌థ‌‌‌‌ల‌‌‌‌తో వ‌‌‌‌చ్చిన ఈ సిరీస్​లో నేను రాజేశ్​ డైరెక్ట్ చేసిన ‘మిరేజ్’లో చేశా. ఇలాంటి థ్రిల్లింగ్ క‌‌‌‌థ‌‌‌‌లో న‌‌‌‌టించ‌‌‌‌డం చాలా కొత్తగా అనిపించింది. అంద‌‌‌‌రూ నా ఎక్స్ ప్రెష‌‌‌‌న్స్, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడటం చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఈ సిరీస్​ వ‌‌‌‌ల్ల ఇండియా మొత్తానికి తెలిసిపోయా. ప్రస్తుతం జయం రవితో ‘అఖిలన్​’, ఎస్​.జె.సూర్యతో ‘బొమ్మై’, శింబుతో ‘పాత్తు తల’ సినిమాలు చేస్తున్నా. ఇంకా ‘రుద్రన్​, ఇండియన్​2’ ప్రాజెక్ట్స్​ చేతిలో ఉన్నాయి.

పెద్ద సినిమాల్లో చేస్తే...
ఇప్పటివరకు చిన్న ఫిల్మ్ మేకర్స్​తోనే ఎక్కువ‌‌‌‌ మూవీస్ చేశా. ఇప్పుడు హరి, శంకర్, రాధామోహన్​లాంటి పెద్ద డైరెక్టర్లతో పని చేసే అవకాశం వచ్చింది.  ‘ఇండియన్-2’ ‘బొమ్మై’ లాంటి పెద్ద సినిమాల్లోచిన్న రోల్స్ చేయడాన్ని కొంతమంది పర్సనల్​గా తీసుకుంటున్నారు.  అయితే, చిన్న సినిమాల్లో మెయిన్ రోల్స్ చేయడంతో పాటు పెద్ద సినిమాల్లో చిన్న రోల్ చేయడం కూడా ముఖ్యమనేది నా ఉద్దేశం. అందుకే ఒప్పుకున్నా.

ఫ‌‌‌‌స్ట్ మూవీ నుంచి 
టీవీ నుంచి వచ్చి తమిళ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చే అవకాశం డైరెక్టర్ రత్నకుమార్ ఇచ్చారు. ఆయన డైరెక్షన్​లో 2017లో వచ్చిన ‘మేయాద మాన్’ మూవీ ద్వారా  కోలివుడ్ లో సిల్వర్ స్క్రీన్​కి పరిచయమయ్యా. ఆ సినిమా సూప‌‌‌‌ర్ హిట్ కావ‌‌‌‌డంతో నాకు మంచి అవ‌‌‌‌కాశాలు రావ‌‌‌‌డం మొద‌‌‌‌లైంది. 2018లో కార్తీతో క‌‌‌‌లిసి ‘క‌‌‌‌డైకుట్టి సింగం’ మూవీలో న‌‌‌‌టించా. ఆ తరువాత ఏడాది ఎస్.జె. సూర్యతో చేసిన ‘మాన్​స్టర్​’ కూడా సూపర్ హిట్ అయ్యింది. వ‌‌‌‌రుస‌‌‌‌గా హిట్స్ రావ‌‌‌‌డంతో ఆఫ‌‌‌‌ర్స్ ‘క్యూ’ క‌‌‌‌ట్టాయి. 2020లో ‘మాఫియా చాప్టర్​ వ‌‌‌‌న్’తో పాటు నేను చేసిన‌‌‌‌ నాలుగు సినిమాలు రిలీజ్​ అయ్యాయి. అదే ఏడాది లాక్ డౌన్ అప్పుడు అమెజాన్ ప్రైమ్​లో విడుద‌‌‌‌లైన ‘టైమ్ ఎన్నా బాస్’ వెబ్ సిరీస్ కూడా నాకు మంచి పేరు తీసుకొచ్చింది.ఏ ప్రాజెక్టు చెయ్యాలి? ఏ ప్రాజెక్టు చేయొద్దని సలహా ఇచ్చేందుకు ఇండస్ట్రీలో నాకు ఎవరూ లేరు. దానివల్ల కొన్ని నిర్ణయాలు తప్పయ్యాయి. ఆ తప్పుల నుంచే ఎంతోకొంత‌‌‌‌  నేర్చుకున్నా. నాకు తెలిసిందల్లా, వచ్చిన ప్రతి అవకాశాన్ని వందశాతం ఉపయోగించుకోవడమే. నాకు అవకాశం ఇచ్చిన వాళ్లకు నా టాలెంట్​ని నమ్మేలా పని చేయడమే  లక్ష్యంగా పెట్టుకున్నా.

వాళ్లకది న‌‌‌‌చ్చదు...
2017లో నేను నటించిన మొదటి సినిమా ‘మేయాద మాన్​’ నుంచి ఈ రోజు ‘విక్టిమ్’ వెబ్ సిరీస్ వరకు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక ప్రాజెక్టును నేను చూసే యాంగిల్​ మారింది. సెట్​లో నా ప్రవర్తన మారింది. ప్రొఫెషనల్​గా మారా.  నాకు స్ట్రాంగ్ రోల్స్ ఆఫర్ చేయని ఎన్నో మూవీస్ రిజెక్ట్ చేశా. ఒకవేళ నేను అవి చేసి ఉంటే, నా కెరీర్​కి ఎక్కువ మైలేజ్ ఉండేదేమో. ఆ ప్రభావం ఇతర ఆఫర్ల మీద పడింది.  కానీ, నేను నా క్యారెక్టర్స్​ని డిమాండ్ చేసే స్థాయికి చేరుకున్నా. నాకంటూ సొంత ఆలోచనలు ఉండటాన్ని కొంతమంది హేళన చేశారు. హీరోయిన్స్ అంటే అందంగా ఉండాలి, స్వీట్​గా మాట్లాడాలి అనుకుంటారు కొందరు. బాగా చదువుకున్నవాళ్లని, జ్ఞానం ఉన్న వాళ్లను ఇష్టపడటానికి వాళ్ల మనసొప్పదు. 

హార్డ్ వ‌‌‌‌ర్క్
ఫిల్మ్ మేక‌‌‌‌ర్స్​కి ఫేమ్, ప్రేమ చాలా ఎక్కువగా లభిస్తాయి.  వాటితోపాటు అంతే ఎక్కువగా ట్రోలింగ్, సైబర్ బుల్లీయింగ్​ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటన్నింటి మధ్యలో ప్రేక్షకుల నమ్మకాన్ని గెలుచుకోవడమే నేను సాధించిన అతిపెద్ద విజయం. ఆ నమ్మకాన్నినేను వమ్ము చేయను. నా మీద నమ్మకం ఉంది కాబట్టే, ‘మేయాద మాన్’ నుంచి ఇక్కడి వరకు వచ్చా. హార్డ్ వర్క్, నిజాయితీ... ఇవే నా కెరీర్​కి పెట్టుబడులు. మూవీ సక్సెస్ కావాలంటే మంచి ప్రొడ్యూసర్ కావాలి. సరైన స్క్రిప్ట్, బెస్ట్ టీం ఉండాలని అనుకునేదాన్ని. కానీ, నేను చేసిన కొన్ని సినిమాల‌‌‌‌కు అనుకున్నంత ఆదరణ రాలేదు. కారణం, వాటికి సరైన ప్రమోషన్స్ లభించకపోవడమే! ప్రమోషన్స్, రిలీజింగ్ టైమ్ ఎంత ముఖ్యమో ఇన్నాళ్లకు రియలైజ్ అయ్యా.

చాలా భ‌‌‌‌య‌‌‌‌ప‌‌‌‌డ్డా...
‘క‌‌‌‌ళ్యాణ‌‌‌‌మ్ ముద‌‌‌‌ల్ కాద‌‌‌‌ల్ వ‌‌‌‌రై’ సీరియ‌‌‌‌ల్​లో లీడ్ క్యారెక్టర్ ప్రియా అర్జున్ పాత్రలో చేశాక దాని ప్రభావం నా మీద చాలా ప‌‌‌‌డింది. ప్రేక్షకులు అంద‌‌‌‌రూ న‌‌‌‌న్ను ప్రియా అర్జున్ లాగే చూసేవాళ్లు.  ఆ సీరియ‌‌‌‌ల్ త‌‌‌‌ర్వాత కొన్నాళ్లకు నేను ఒక వెకేష‌‌‌‌న్ కి వెళ్లి సోష‌‌‌‌ల్ మీడియాలో ఫొటోలు పెట్టా. ‘నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకోకూడ‌‌‌‌ద‌‌‌‌’ని కామెంట్స్ వచ్చాయి. విపరీతంగా ట్రోల్స్ చేశారు. సీరియ‌‌‌‌ల్​లో ఉన్న ఒక క‌‌‌‌ల్పిత పాత్రలో ఉన్నట్టు ఏళ్లకు ఏళ్లు రియ‌‌‌‌ల్ లైఫ్ లో ఉండ‌‌‌‌లేం క‌‌‌‌దా?  అది నాకు చాలా భ‌‌‌‌యంగా అనిపించింది. ఆ సీరియ‌‌‌‌ల్  ఇమేజ్​ని బ్రేక్ చేయ‌‌‌‌డం నాకు చాలా క‌‌‌‌ష్టమైంది. 2020లో ‘మాఫియా’ మూవీలో స‌‌‌‌త్య అనే పోలీస్ రోల్ చేశాక ఆ ఇమేజ్ నీడ నుంచి నెమ్మదిగా బ‌‌‌‌య‌‌‌‌టప‌‌‌‌డ్డా. సీరియ‌‌‌‌ల్ ట్యాగ్ తొల‌‌‌‌గించుకోవ‌‌‌‌డానికి డిఫ‌‌‌‌రెంట్ రోల్స్ ఎంచుకుంటున్నా.

ల‌‌‌‌క్కును న‌‌‌‌మ్మను
నిజంగా నేను లక్కును న‌‌‌‌మ్మను. ఆలోచ‌‌‌‌న‌‌‌‌ల్ని ఆచ‌‌‌‌ర‌‌‌‌ణ‌‌‌‌లో పెట్టాలని నమ్మే వ్యక్తిని. కానీ, నేను చాలా జాగ్రత్తగా స్క్రిప్ట్ ఎంచుకుంటాను. నా మూవీస్ కౌంట్ పెర‌‌‌‌గాల‌‌‌‌ని కోరుకునే ర‌‌‌‌కం కాదు. స్క్రిప్ట్, ప్రొడ‌‌‌‌క్షన్ హౌజ్, నా క్యారెక్టర్... ఈ మూడు నాకు చాలా ముఖ్యం. ఇన్​స్టాగ్రామ్​లో నాకు 30 లక్షలకు పైగా ఫాలోవ‌‌‌‌ర్స్ ఉన్నారు. ఆ నెంబర్ చూసి, నేను స్టార్ అని మురిసిపోను. ఎందుకంటే, ఇన్​స్టాగ్రామ్​ ఫాలోవ‌‌‌‌ర్స్ మ‌‌‌‌న‌‌‌‌ల్ని స్టార్స్ గా మార్చలేరు. ఆడియెన్స్ కేవ‌‌‌‌లం న‌‌‌‌న్ను చూడ‌‌‌‌టానికి థియేట‌‌‌‌ర్​కి వ‌‌‌‌స్తార‌‌‌‌ని అనుకోను. నా జ‌‌‌‌ర్నీ లో నేను ఇంకా  చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఇప్పుడు  స్టార్ హీరోయిన్స్​కి కూడా క‌‌‌‌మ‌‌‌‌ర్షియ‌‌‌‌ల్ సినిమాల్లో కొంచెమే స్పేస్ దొరుకుతుంది. ఈ విష‌‌‌‌యంలో నేను కొంచెం బెట‌‌‌‌ర్​గానే ఉన్నా. నా రోల్స్​ని డిమాండ్ చేసే పొజిషన్​లో ఉన్నందుకు సంతోషంగా ఉంది.

అతడే నా బ‌‌‌‌లం
నా కాలేజ్ ఫ్రెండ్  రాజ్వేల్​తో ప్రేమ‌‌‌‌లో ప‌‌‌‌డ్డా. కాలేజీ రోజుల నుంచి నాకు అతను ఇచ్చే సపోర్ట్ చాలా విలువైన‌‌‌‌ది. నాకు ఏది ఇష్టమో అత‌‌‌‌నికి బాగా తెలుసు. నా ఎదుగుద‌‌‌‌ల, ఫేమ్ అత‌‌‌‌నికి ఇన్​సెక్యూరిటీ క‌‌‌‌లిగిస్తుంద‌‌‌‌న్న ఫీలింగ్ నాకు ఎప్పుడూ రాలేదు. నేను ఏం సాధించినా అత‌‌‌‌ని ముఖంలో నాకు  సంతోషం మాత్రమే క‌‌‌‌నిపిస్తుంది. ప‌‌‌‌రిస్థితులు అనుకూలించ‌‌‌‌న‌‌‌‌ప్పుడు, కెరీర్ లేదా జీవితం త‌‌‌‌ల‌‌‌‌కిందులైనా స‌‌‌‌రే న‌‌‌‌న్ను చూసుకోవ‌‌‌‌డానికి అత‌‌‌‌ను ఉన్నాడ‌‌‌‌నే భ‌‌‌‌రోసా నాకు ఉంది.

అందుకే  వాళ్లకు  అవ‌‌‌‌కాశాలు
‘త‌‌‌‌మిళం మాట్లాడే లోక‌‌‌‌ల్ హీరోయిన్స్ ఎక్కువ‌‌‌‌మంది ఇండ‌‌‌‌స్ట్రీలో ఎందుకు లేర’ని చాలామంది న‌‌‌‌న్ను అడుగుతుంటారు. హీరోయిన్ అంటే ఫెయిర్ స్కిన్​తో ఉండాల‌‌‌‌ని అనుకుంటారు ఆడియెన్స్. తెల్లగా ఉన్న వాళ్ల పట్ల ఎట్రాక్ట్​ అవుతారనడం కాద‌‌‌‌న‌‌‌‌లేని నిజం. అదే హీరోల విష‌‌‌‌యంలో చూస్తే... ఇది రివ‌‌‌‌ర్స్​లో ఉంటుంది. వాళ్లయితే మ‌‌‌‌న‌‌‌‌ ప‌‌‌‌క్కింటివాళ్ల లాగే ఉండాలి. హీరోయిన్ల విష‌‌‌‌యానికి వ‌‌‌‌స్తే మాత్రం ఫ్రెష్ ఫేస్ కావాలంటారు. అందుకే, ఇక్కడ నార్త్ ఇండియన్​ హీరోయిన్స్​కు అవ‌‌‌‌కాశాలు ఎక్కువ ఇస్తారు.
::: గుణ

న్యూస్ రీడ‌‌‌‌ర్​గా...  


పుట్టి పెరిగింది చెన్నైలోనే. నాన్న భ‌‌‌‌వానీ శంక‌‌‌‌ర్, అమ్మ తంగ‌‌‌‌మ్ భ‌‌‌‌వానీ శంక‌‌‌‌ర్.  నా చ‌‌‌‌దువంతా చెన్నైలోనే సాగింది.  బి.ఎస్​. అబ్దుర్​ రహ్మాన్​ క్రిసెంట్​ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదివా. తర్వాత చెన్నై అన్నాయూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశా. కాలేజీ పూర్తవ్వగానే, మీడియా మీద ఇంట్రెస్ట్​తో టీవీలో న్యూస్ రీడర్​గా కెరీర్  మొదలుపెట్టా. 2011 నుండి 2014 వరకు ‘పుదియ తళైమురై’ అనే తమిళ వార్తా ఛానెల్​లో న్యూస్ రీడర్​గా పనిచేశా. మాది రిచ్ ఫ్యామిలీ కాదు. నాకు గ్లామ‌‌‌‌ర‌‌‌‌స్ ఇమేజ్ కూడా లేదు. హార్డ్ వ‌‌‌‌ర్క్, నా టీంతో బాండింగ్​.. ఈ రెండే నా పోర్ట్ ఫోలియో. అదే న‌‌‌‌మ్మకంతో సీరియ‌‌‌‌ల్ చేయ‌‌‌‌డానికి ఒప్పుకున్నా. అదే స్టార్ విజయ్ ఛానెల్​లో వచ్చిన ‘కళ్యాణం ముదల్ కాదల్ వరై’. ఈ సీరియల్ ద్వారా టీవీకి పరిచయమయ్యా. 2014 నుంచి 2017 వరకు 583 ఎపిసోడ్స్ టెలికాస్ట్​ అయిన ఈ సీరియల్ నాకు మంచిపేరు తెచ్చింది. నన్ను ‘కళ్యాణం ముదల్ కాదల్ వరై ప్రియా’ అనిపిలవడం మొదలుపెట్టారు.  సీరియల్​ చేస్తూనే విజయ్ టీవీలో ‘జోడి నెంబర్ వన్ సెలబ్రిటీ’, ‘ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్’, ‘ఎయిర్ టెల్ సూపర్ సింగర్ సీజన్ 5’, ‘కింగ్స్ ఆఫ్ డాన్స్ ’  ప్రోగ్రామ్స్​కు హోస్ట్​గా చేశా.