సైంటిస్టులు : ఆహారంలో మిర్చిని యాడ్ చేస్తే ఎక్కవ కాలం జీవించొచ్చు

సైంటిస్టులు : ఆహారంలో మిర్చిని యాడ్ చేస్తే ఎక్కవ కాలం జీవించొచ్చు

వంటలు టేస్ట్ కోసం లేదంటే స్పైసీగా ఉండేందుకు విరివిరిగా మిరపకాయల్ని వాడుతుంటాం. అయితే ఈ మిరపకాయల్ని కలిపి  చేసిన ఆహార పదార్ధాల్ని తినడం వల్ల టేస్టే కాదు ఎక్కువ కాలం జీవించవచ్చని అమెరికాకు చెందిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సంస్థ తెలిపింది. అమెరికాతో పాటు ఇటలీ, చైనా, ఇరాన్ వంటి దేశాల్లో సుమారు 5లక్షల 70వేల మంది ఆరోగ్యంపై నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మిరపకాయల్లో ఉండే విటమిన్ల వల్ల శరీరంపై ఎర్రటి మచ్చలు, వాపు, మరియు నొప్పి, గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు, క్యాన్సర్ కారకాల్ని హతమార్చే గుణాలతో పాటు రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ను నియంత్రించే లక్షణాలు ఉన్నాయి.

అయితే ఆహారంలో  మిరప కాయల్నిఉపయోగిస్తున్న 5లక్షల 70వేల మందిని పరీక్షించగా..వారిలో 26శాతం గుండె సంబంధిత సమస్యలు, 23శాతం క్యాన్సర్ రాకుండా ఉండేందుకు, ఇతర అనారోగ్య సమస్యల వల్ల మరణించే అవకాశం  25శాతం తగ్గినట్లు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సైంటిస్ట్ లు తెలిపారు. తద్వారా ఆయా అనారోగ్య సమస్యల నుంచి సురక్షితంగా ఉండడం వల్ల ఎక్కువ కాలం జీవిస్తారని చెప్పారు.

మరోవైపు గతంలో నిర్వహించిన పరిశోధనల్లో మిరపకాయల్ని తినడం ద్వారా గుండె సంబంధిత సమస్యలతో పాటు క్యాన్సర్ కు దోహదం చేసే కారకాల్ని నాశనం చేసే శక్తి  ఉందని గుర్తించి ఆశ్చర్యపోయినట్లు డాక్టర్ బోజు వెల్లడించారు