టీఎస్​పీఎస్సీ కీలక నిర్ణయం

 టీఎస్​పీఎస్సీ కీలక నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రద్దయిన పరీక్షలపై టీఎస్​పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. రద్దు చేసిన పరీక్షలకు అప్లై చేసుకున్న అందరికీ మళ్లీ రాసే అవకాశం కల్పించనుంది. క్వశ్చన్ పేపర్ల లీకేజీ వ్యవహారంతో ఇప్పటికే ఏఈ, ఏఈఈ, గ్రూప్​1, డీఏవో పరీక్షలను కమిషన్ రద్దు చేసింది. గ్రూప్​1 ప్రిలిమ్స్​ను జూన్​11న నిర్వహించనున్నట్టు ప్రకటించింది.

అయితే, ఆయా పరీక్షలను గతంలో రాసినోళ్లను మాత్రమే అనుమతిస్తారా? లేదా అప్లై చేసిన వాళ్లందరికీ అవకాశం ఇస్తారా? అనే సందిగ్ధత ఏర్పడింది. ఈ నేపథ్యంలో రద్దయిన ఆయా పరీక్షలకు అప్లై చేసిన వారందరికీ ఇప్పుడు ఎగ్జాం రాసే అవకాశం కల్పిస్తామని కమిషన్ అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా, గ్రూప్ 1కు 3,80,204 మంది, ఏఈ పోస్టులకు 74,488 మంది, ఏఈఈకి 81,148 మంది,  డీఏవోకు 1,06,253 మంది అప్లై చేసుకున్నారు.