గురుకుల టీచర్లపై  ఒత్తిడి తగ్గించాలి: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

గురుకుల టీచర్లపై  ఒత్తిడి తగ్గించాలి: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

ముషీరాబాద్, వెలుగు: అత్యున్నత ఫలితాలు సాధిస్తున్న గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయులపై మానసిక ఒత్తిడి తగ్గించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి  కోరారు. శ్రమకు తగిన వేతనాలు ఇవ్వాలని, అన్ని గురుకులాల్లో  కామన్ డైరెక్టరేట్​అమలు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో  గురుకుల ఉపాధ్యాయుల మహాధర్నా టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు  కె జంగయ్య అధ్యక్షతన జరిగింది.ఈ ధర్నాలో ఎమ్మెల్సీ  నర్సిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు సంతోషంగా పని చేయగలిగితేనే విద్యార్థులకు సంతృప్తికరంగా బోధించగలుగుతారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి హాజరై మాట్లాడుతూ... గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఎం కేసీఆర్​కు లేఖ రాస్తామన్నారు.

యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ జీఓ 317 అమలుపై వివాదాలను సానుకూలంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.  కార్యక్రమంలో నేతలు డీజీ నరసింహారావు,  లక్ష్మారెడ్డి,  సింహాచలం,  మాణిక్ రెడ్డి, గురుకులాల ప్రతినిధులు ఎస్ శ్రీజన, డి ఎల్లయ్య, రాంబాబు,  హరీందర్ రెడ్డి, ఎన్ రాజశ్రీ ,  ప్రతిభ, లివిన్ స్టన్, మహేశ్, దామోదర్,  వేదాంత చారి, డా. సత్యం, వై సైదులు,  అశోక్,  గోపాల్ నాయక్, రమేశ్​కుమార్,  వలీ అహ్మద్, యాదగిరి, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.