స్నానం చేస్తున్నప్పుడే జవాబు దొరకని పశ్నలకు సమాధానాలు ..!

స్నానం చేస్తున్నప్పుడే జవాబు దొరకని పశ్నలకు సమాధానాలు ..!

యురేకా! ఈ పదం చాలామంది వినే ఉంటారు. కొన్ని సందర్భాల్లో అనే ఉంటారు. గ్రీకు మేథమెటీషియన్‌‌ ఆర్కిమెడిస్‌‌కు చాలారోజులుగా బుర్రకు తట్టని సమాధానం ఒకటి, స్నానం చేసేటప్పుడు తెలిసింది. అప్పుడే ‘యురేకా.. యురేకా’ అంటూ అరిచాడు. ఒక్క ఆర్కిమెడిస్‌‌కే కాదు, మనలో చాలామందికి కూడా పరిష్కారం లేవనుకున్నవి, జవాబు దొరకని పశ్నలకు సమాధానాలు స్నానం చేస్తున్నప్పుడే బుర్రకు తడుతుంటాయి. 

ఈ విషయం ఎప్పుడైనా గమనించారా!

యూనివర్సిటీ ఆఫ్‌‌ వర్జీనియాలోని జాక్‌‌ ఇర్వింగ్‌‌ అనే ఫిలాసఫీ ప్రొఫెసర్‌‌‌‌ ‘క్రియేటివ్‌‌ ఐడియాలన్నీ బాత్‌‌రూమ్‌‌లో స్నానం చేస్తున్నప్పుడే ఎందుకు వస్తాయి’ అనే దానిపై రీసెర్చ్‌‌ చేయడం మొదలుపెట్టాడు. 40 మందిపై చేసిన ‘మోడల్ ఆఫ్‌‌ ది ఎఫెక్ట్‌‌’ ఎక్స్‌‌పరిమెంట్‌‌లో మెదడులో జరిగే మార్పులే దీనికి కారణం అని కనుగొన్నాడు. లైఫ్‌‌లో ఎదురయ్యే రకరకాల ప్రాబ్లమ్స్‌‌, ప్రశ్నలకు బుర్ర పగిలేలా ఆలోచిస్తారు. వాటికి సమాధానం వెతుకుతుంటారు. ఏదైనా ఒక విషయం గురించి ఎక్కువ తెలుసుకోవాలని లేదా ఆ విషయం అలా ఎందుకు జరిగింది? ఇలా జరిగితే బాగుండని అనుకుంటూ.. తెగ ఆలోచిస్తారు. అలా ఆలోచిస్తూ స్నానానికి వెళ్లిన వాళ్లకు సొల్యూషన్‌‌గా కొత్త ఐడియాలు వస్తుంటాయి. అలా ఎందుకు జరుగుతుందని తెలుసుకోవడానికే ఒక 40 మందిని శాంపిల్​గా తీసుకున్నాడు. వాళ్లని రెండు గ్రూపులుగా డివైడ్‌‌ చేశాడు జాక్‌‌. వాళ్లకు బోర్‌‌‌‌గా అనిపించే వీడియో క్లిప్స్‌‌, అడ్వెంచరస్‌‌ వీడియో క్లిప్స్‌‌ చూపించాడు. తరువాత క్రియేటివ్‌‌ యాక్టివిటీలు, టాస్క్‌‌లు ఇచ్చి వాటిని సాల్వ్‌‌ చేయమన్నాడు. ఆ వీడియోలు చూశాక టాస్క్‌‌లు పూర్తి చేయలేకపోయారు వాళ్లు. తరువాత వాళ్లకు ఫ్రెష్‌‌ అవ్వమని బ్రేక్‌‌ ఇచ్చాడు. ఆ గ్యాప్‌‌లో రిఫ్రెష్‌‌ కోసం స్నానానికి వెళ్లిన వాళ్లు యాక్టివిటీలు, టాస్క్‌‌లు పూర్తి చేయడం, మిగతావాళ్లు మొదటి లెవల్స్ కూడా దాటలేకపోవడం గమనించాడు. దాన్నే టెస్ట్‌‌ చేస్తే ‘ఒక విషయాన్ని పదే పదే అనుకుంటుంటే ఆ విషయంపై మెదడులో రియాక్షన్స్ జరుగుతాయి. అలాంటప్పుడు స్నానానికి వెళ్తే, మెదడులో క్రియేటివిటీ  పెరిగే రియాక్షన్ జరిగి కొత్త ఆలోచనలు వస్తాయ’ని తెలిసింది జాక్‌‌కి.