ప్రస్తుతం నటి అలియా భట్ హిందీలో జిగ్రా అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 10వ తారీఖున విడుదల కాబోతోంది. దీంతో సినిమా ప్రమోషన్స్ లో ఈవెంట్లు, ఇంటర్వూలు అంటూ బిజిబిజిగా గడుపుతోంది. కాగా తన గురించి ఆసక్తికరమైన విషయాన్ని ప్రేక్షకులతో పంచుకుంది.
తనకి అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ సమస్య(ADD) ఉందని తెలిపింది. దీంతో మేకప్ చైర్ లో 45 నిమిషాలకంటే ఎక్కుసేపు కూర్చోలేనని చెప్పుకొచ్చింది. అలాగే మేకప్ ఆర్టిస్టులకు ఈ విషయం గురించి ముందుగానే చెప్పి వీలైనంత త్వరగా తన మేకప్ పూర్తి చెయ్యాలని సూచిస్తుంటానని వెల్లడించింది.
ALSO READ : మరో హిందీ వెబ్ సీరీస్ లో నటిస్తున్న సమంత.
అయితే నటి అలియా భట్ తెలుగులో స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఆర్.ఆర్.ఆర్ సినిమాలో సీత పాత్రలో నటించింది. ఈ సినిమాలో అలియా పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ చక్కటి కట్టు బొట్టు తెలుగందంతో పల్లెటూరి యువతి పాత్రలో కనిపించడంతో తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు.