టాలీవడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్ళీ వరుస నటిస్తూ బిజిబిజీ అవుతోంది. ఈ క్రమంలో కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా వెబ్ సీరీస్ లలో నటించేందుకు కూడా ఒకే చెబుతోంది. కాగా సమంత హిందీలో ప్రముఖ ఓటిటి మరియు సినీ నిర్మాణ సంస్థ నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న "రక్త్ బ్రహ్మాండ్" అనే వెబ్ సీరీస్ లో నటిస్తున్నట్లుప్రకటించింది.
ఈ వెబ్ సీరీస్ లో బాలీవుడ్ నటి వామికా గబ్బి, మిర్జాపూర్ ఫేమ్ అలీ ఫజల్, ఆదిత్య రాయ్ కపూర్, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ వెబ్ సీరీస్ 6 ఎపిసోడ్లు ఉండనున్నట్లు సమాచారం. కాగా ఈ వెబ్ సీరీస్ ని హిందీలో తుంబాడ్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన రాహీ అనిల్ బ్రేవ్ మరియు రాజ్ & డీకే తదితరులు కలసి డైరెక్ట్ చేస్తున్నారు.
అయితే నటి సమంత ఆమధ్య హిందీలో పాపులర్ అయిన ఫ్యామిలి మ్యాన్ రెండవ సీజన్ లో నటించింది. ఈ పాత్ర కొంచెం బోల్డ్ గా ఉండటంతో సమంత అభిమానులు పెద్దగా ఇష్టపడలేదు.
ఈ విషయం ఇలా ఉండగా ఈ ఏడాది నటి సమంత తెలుగులో శాకుంతలం, ఖుషీ చిత్రాల్లో నటించింది. కానీ ఈ చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో మంచి హిట్ సమంత బాగానే శ్రమిస్తోంది.