ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ హెయిర్‌స్టైలిస్ట్ మార్సే పెడ్రోజో (Marce Pedrozo) అకస్మాత్తుగా కన్నుమూయడం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయనతో కలిసి పనిచేసిన పలువురు నటీనటులు, టెక్నీషియన్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor).. తనకు అతనితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.
కలిసి పనిచేసిన మధుర క్షణాలు
జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మార్సేతో కలిసి పనిచేసిన సందర్భాల వీడియోలు, ఫోటోలు పంచుకున్నారు. షూటింగ్‌ల సమయంలో ఎదురయ్యే ఒత్తిడి, టైమ్ ప్రెజర్ మధ్య ఇద్దరూ పంచుకున్న సరదా క్షణాలను ఆమె గుర్తుచేసుకున్నారు. “మేము ఒక్క టీమ్‌లా కాదు, ఒకరికి ఒకరం టీమ్‌గా ఉండేవాళ్లం. నిన్ను ప్రతిరోజూ మిస్ అవుతుంటాను” అంటూ ఆమె రాసిన మాటలు వారి మధ్య ఉన్న బాండింగ్ను గుర్తుచేసేలా ఉంది.
భావోద్వేగ వీడ్కోలు
తన పోస్టులో జాన్వీ మరింత ఎమోషనల్గా రియాక్ట్ అవుతూ , “నువ్వు కేవలం నా టీమ్‌లో ఒకడివి కాదు.. మనం ఒకరికొకరం టీమ్. ఒకరిపై ఒకరికి ఉన్న ఆ చొరవ వల్ల నన్ను నన్ను ఎవరో జాగ్రత్తగా చూసుకుంటున్నారనే ఫీలింగ్ కలిగేది. నువ్వు నా మనిషివి. నీతో ఇంకో 20 నిమిషాలు గడిపే అవకాశం ఉంటే, మా జీవితాల్లో నువ్వు ఎంతటి వెలుగు నింపావో చెప్పేదాన్ని” అని జాన్వీ ఎమోషనల్ అయింది.
అలాగే, “నీ మనసు, నీ ఆత్మ ఎప్పటికీ అందమైనవే. నువ్వు గొప్ప కళాకారుడు, స్వచ్ఛమైన వ్యక్తి. ఐ లవ్ యు మార్సీ.. నిన్ను ప్రతిరోజూ మిస్ అవుతాను” అంటూ జాన్వీ తన ఫిలింగ్ వ్యక్తపరిచింది.
ALSO READ : ఓవర్సీస్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్' రికార్డుల వేట..
క్రియేటివ్ బాండింగ్
మార్సే కేవలం హెయిర్‌స్టైలిస్ట్ మాత్రమే కాకుండా, తనకు ఎంతో నమ్మకమైన వ్యక్తి అని జాన్వీ తెలిపారు. ప్రతి ప్రాజెక్ట్‌లో కొత్త లుక్స్‌పై కలిసి పనిచేసిన క్షణాలను ఆమె మిస్ అవుతున్నట్లు చెప్పారు. అతని ఆలోచనలు, క్రియేటివిటీ, సరదా స్వభావం తమ జీవితాల్లో ఎంతో రంగులు నింపాయని పేర్కొన్నారు. గత కొన్ని ఏళ్లుగా నా ప్రతి క్రియేటివ్ జర్నీ మొదట్లో, చివర్లో నీ ముఖాన్ని చూడటం నా లైఫ్‌లో దక్కిన అతిపెద్ద గౌరవం అని జాన్వీ చెప్పింది.
సినీ ప్రముఖుల సంతాపం
మార్సే పెడ్రోజో మృతిపై బాలీవుడ్ నటులు వరుణ్ ధావన్ నుండి నోరా ఫతేహి సహా పలువురు సంతాపం తెలిపారు. అతని సరదా వ్యక్తిత్వం, పనిపై అంకితభావం అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతుందని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
మరణానికి కారణం వెల్లడి కాలేదు
మార్సే పెడ్రోజో మరణానికి గల కారణం ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఆయన ఆకస్మిక మరణం బాలీవుడ్ సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
