అసెంబ్లీ ఆవరణలో ‘తెలంగాణ తల్లి’ విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్

అసెంబ్లీ ఆవరణలో ‘తెలంగాణ తల్లి’ విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్

అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అంతకుముందు ప్రాంగణంలో ఉన్న గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు గవర్నర్ నివాళి అర్పించారు.

విగ్రహ ఆవిష్కరణకు ముందు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత, జాతిపిత ఆశయాలకు అనుగుణంగా తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తామని స్మరించుకున్నారు.

ALSO READ : తెలంగాణలో ఈ వారం వర్షాలు..ఈ 17 జిల్లాల వాళ్లు అలర్ట్..