హైదరాబాద్: పేద క్రైస్తవులకు ఉచిత న్యాయ సహాయం అందించే లక్ష్యంతో గ్లోబల్ క్రిస్టియస్ లా బోర్డ్ ప్రారంభించినట్లు కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సికింద్రాబాద్లో ని మెట్టుగూడలో కొత్తగా ఏర్పాటు చేసిన గ్లోబల్ క్రిస్టియన్ లా బోర్డ్ కార్యాలయాన్ని మంత్రి వివేక్ ప్రారంభించారు. దీనిలో భాగంగా ఆయన మా ట్లాడుతూ.. క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్న లీగల్ సమస్యలను పరిష్కరించేందుకు బోర్డు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ లాంటి లక్ష్యం తో బోర్డును స్థాపించడం అభినందనీయమని మంత్రి తెలిపారు.
నగరంలో క్రైస్తవులకు ప్రత్యే కంగా క్రిస్టియన్ భవన్ లేదనే అంశం తన దృష్టికి వచ్చిందని, వివాదాలు లేని స్థలంలో భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసేలా ము ఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. మైనారిటీ సంక్షేమ శాఖలో క్రైస్తవ మహిళల కోసం అనేక పథకాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థి కంగా ఎదగాలని మంత్రి సూచించారు. ఈ లా బోర్డ్ ద్వారా క్రైస్తవ సమాజానికి మరింత మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అం తకుముందు మంత్రి వివేక్ బోర్డు ప్రతినిధులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
