రూట్ల పర్మిట్​ చెల్లదు: అశ్వత్థామరెడ్డి

రూట్ల పర్మిట్​ చెల్లదు:  అశ్వత్థామరెడ్డి

    దానికి కేంద్రం అనుమతి తప్పనిసరి

    చట్టం ప్రకారం ఏపీఎస్‌‌ ఆర్టీసీలోనే ఉన్నం

    ఈ నెల 4 లేదా 5న అమిత్‌‌ షాను కలుస్తాం: అశ్వత్థామరెడ్డి

    కాగితాల్లోనే టీఎస్‌‌ ఆర్టీసీ: కోదండరాం

    ఉద్యమ కార్యాచరణపై చర్చించిన ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్షం

     ఈ నెల 9న ‘చలో ట్యాంక్​బండ్​’

రూట్ల పర్మిట్‌‌ అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదని, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా చెల్లదని ఆర్టీసీ జేఏసీ చైర్మన్​ అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు. రూట్లు పర్మిట్‌‌ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీని ఇంకా విభజించలేదని చెప్పారు. ప్రస్తుతం చట్టం ప్రకారం ఏపీఎస్‌‌ ఆర్టీసీలోనే ఉన్నామని తెలిపారు. ఈ నెల 4 లేదా 5న ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్‌‌ షాను కలుస్తామని, రాష్ట్రంలోని పరిస్థితిపై, సమ్మె గురించి వివరించి జోక్యం చేసుకోవాలని కోరుతామని వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌‌లోని ఎంప్లాయీస్‌‌ యూనియన్‌‌ ఆఫీసులో ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు. రాష్ట్ర కేబినెట్‌‌ మీటింగ్‌‌, కోర్టు అంశాలు, భవిష్యత్‌‌ ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చించారు.

సమ్మెకు సంబంధిం చి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. సమావేశం అనంతరం నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అశ్వత్థామరెడ్డి మాట్లా డుతూ..ఈ నెల 9వ తేదీ వరకు వివిధ రూ పాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. 9న హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై అన్ని విగ్రహాల వద్ద రెం డు గంటల పాటు దీక్ష చేస్తామని చెప్పారు. కార్మి కులందరు ధైర్యం గా ఉండాలని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. సమ్మె యథావిధిగా కొనసాగుతుం దని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి కైనా చర్చలు ప్రా రంభిం చి, సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాం డ్ చేశారు.

కాగి తాల్లో నే టీఎస్‌ ఆర్టీసీ : కోదండరాం
ఆర్టీసీ జేఏసీ నిరసన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులంతా పాల్గొనా లని టీజేఎస్‌‌‌‌ చీఫ్ కోదండరాం పి లుపునిచ్చారు. ప్రస్తుతం ఏపీఎస్‌‌‌‌ ఆర్టీసీలోనే ఉన్నామని, టీఆఎస్‌‌‌‌ ఆర్టీసీ లే దని, అది కాగితాలకే పరిమితమని చెప్పారు. ముం దుగా టీఎస్‌‌‌‌ ఆర్టీసీని ఏర్పాటు చేయాలన్నారు . రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటు నిర్ణయాలకు కార్మికులు ఆందోళన చెం దవద్దని సూచిం చారు. సామరస్యంగా పరిష్కరిం చాలి: మోహన్ రెడ్డి బీజేపీ నేత మోహన్‌‌‌‌ రెడ్డి మాట్లా డుతూ కేసీఆర్‌‌‌‌ నిర-్ణయంతో కార్మి కులు గుండె ఆగి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సా మరస్యంగా సమస్యలను పరిష ్కరించాలన్నారు . ఆర్టీసీ జేఏసీ కార్యక్రమాలకు పార్టీ పూర్తి మద్దతు ఇస్తుం దని చెప్పారు.

సమ్మె చరిత్రలో నిలుస్తుం ది: రావుల
ప్రభుత్వం ఎన్ని ఒత్తిడులు తెచ్చినా, రెం డు నెలలుగా జీతాలు లే కున్నా ఏకతాటిపైకి వచ్చిన పోరాడుతున్న కార్మి కులకు అభిందనలు తెలుపుతున్నట్లు టీడీపీ నేత రావులు చంద్రశేఖర్‌‌‌‌ రెడ్డి అన్నారు . ఆర్టీసీ కార్మి కుల సమ్మె చరిత్ర లో నిలిచిపోతుం దని తెలిపారు. కోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా రాష్ట్ర ప్రభుత్వం మారడంలేదని మండిపడ్డా రు. నిరసన కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా తమ పార్టీ కేడర్ పాల్గ ొంటుం దని చెప్పారు.

కేసీఆర్ మొండి వైఖరి వీడాలి: తమ్మినేని
ఆర్టీసీ జేఏసీ నిరసన కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. సీఎం కేసీఆర్‌‌‌‌ మొం డివైఖరి వీడాలన్నారు . కార్మి కులు ఇదే పోరాట పంథాను కొనసాగించాలని సూచిం చారు. ఆర్టీసీని విభజిం చే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లే దన్నారు. ఆర్టీసీ అంశంపై కేం ద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని కోరారు.

అణచివేత ధోరణి మానుకోవాలి: చాడ
ఆర్టీసీ కార్మి కుల పట్ల కేసీఆర్ కక్ష పూరితంగా వ్యవహరిస్తు న్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అణచివేత ధోరణి మానుకోవాలన్నారు . సమ్మెపై ఢిల్లీ పెద్దలను కలుస్తామని తెలిపారు. ఈ నెల 9 వరకు జరగనున్న ఆర్టీసీ కార్మికుల అన్ని కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పాల్గొనా లని ఆయన పి లుపునిచ్చారు.

 

ఆర్టీసీ జేఏసీ కార్యచరణ ఇదీ..
ఈ నెల 3: అమరులైన కార్మి కులను స్మరిస్తూ పల్లె బాట కార్యక్రమం. తాత్కాలి క సిబ్బంది డ్యూటీలోకి రావొద్దని విజ్ఞప్తి.
ఈ నెల 4: అన్ని డిపోల వద్ద బైఠాయిం పు.
ఈ నెల 5: హైదరాబాద్ తో సహా రాష్ట్రమంతా సడక్‌ బంద్‌‌‌‌.
ఈ నెల 6: ఆర్టీసీ కార్మి కుల కుటుం బాలతో డిపోల వద్ద దీక్షలు.
ఈ నెల 7: సమ్మెకు మద్దతుగా అన్ని ప్రజా సంఘాల ప్రదర్శనలు.
ఈ నెల 8: ‘చలో ట్యాం క్‌ బండ్‌‌‌‌’కు సన్నాహక ఏర్పాట్లు.
ఈ నెల 9: ‘చలో ట్యాం క్‌ బండ్‌‌‌‌’ నిర్వహణ.
ట్యాంక్ బండ్ పై గల అన్ని విగ్రహల వద్ద రెండు గంటలపాటు దీక్షలు.