కార్చిచ్చుపై ఆస్ట్రేలియా ఎంక్వయిరీ

కార్చిచ్చుపై ఆస్ట్రేలియా ఎంక్వయిరీ

సిడ్నీ: కంగారూ కంట్రీ ఆస్ట్రేలియాలో ఈ ఏడాది మొదట్లో చెలరేగిన కార్చిచ్చుపై ఆ దేశ ప్రభుత్వం విస్తృత స్థాయి విచారణను ప్రారంభించింది. ఈ బుష్ ఫైర్స్ వల్ల 33 మంది పౌరులు చనిపోగా, 2,500 మంది నిరాశ్రయులయ్యారు. అలాగే సౌత్ కొరియా అంత పరిమాణంలో ఉన్న ఒక ప్రాంతం ధ్వంసం అయింది. వందలాది మంటలు, వాటిలో కొన్ని భారీ సైజులో జరిగినవి ఉండటంతో ఆస్ట్రేలియా ఈస్ట్ కోస్ట్ కాలిపోయింది. ఎట్టకేలకు దీనిని ఫిబ్రవరిలో అధికారులు అదుపులోకి తీసుకొచ్చారు. ‘ఈ విధ్వంసం వల్ల జీవితాన్ని కోల్పోయాం. ఇళ్లు ధ్వంసమవడం, పశువులు చనిపోవడంతోపాటు లక్షలాది హెక్టార్ల అడవులు విధ్వంసమవడం ప్రజల జీవనం, కోలుకోవడంపై లోతుగా ప్రభావం చూపుతున్నాయి’ అని కార్చిచ్చుపై ఎంక్వయిరీ నిర్వహిస్తున్న చైర్ ఆఫ్ ద ఎంక్వయిరీ మార్క్ బిన్ స్కిన్ ఓ ప్రకటనలో తెలిపారు. భవిష్యత్తులో సంభవించే కార్చిచ్చులకు సంసిద్ధత కోసం ఈ విషయంపై ఆరు నెలల పాటు రాయల్ కమిషన్ ఇన్వెస్టిగేట్ చేయనుందని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ చెప్పారు. అలాగే ఎమర్జెన్సీ అథారిటీస్ కు ఎవరు బాధ్యత వహిస్తారో కూడా రాయల్ కమిషన్ సూచిస్తుందన్నారు. కాన్ బెర్రాలో రెండు వారాల పాటు రాయల్ కమిషన్ విచారణ కొనసాగనుంది. దీంట్లో గ్లోబల్ క్లైమేట్ ను మార్చడంతోపాటు నేచురల్ డిజాస్టర్ రిస్క్ ను మార్చడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.