
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపల్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. మున్సిపల్ చైర్ పర్సన్ రేఖా యాదగిరికి వ్యతిరేకంగా 14 మంది కోరం సభ్యులు చేతులు లేపారు. అయితే అవిశ్వాస తీర్మానంలో ఓడిపోతామని తెలిసి చైర్మన్ రేఖా యాదగిరి వర్గం సభ్యులు సమావేశానికి హాజరు కాలేదు.
అవిశ్వాసాన్ని ఆపడానికి వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. గోవా కేంద్రంగా మరో వర్గం కొనసాగించిన క్యాంప్ రాజకీయం ఫలించి చైర్ పర్సన్ రేఖా పై అవిశ్వాం నెగ్గింది.