కాకా విజన్ అందరికీ ఆదర్శం : గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

కాకా విజన్ అందరికీ ఆదర్శం : గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

దివంగత కాకా వెంకటస్వామి  విజన్ అందరికీ ఆదర్శమన్నారు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని బీఆర్ అంబేద్కర్  లా కాలేజీ విద్యాసంస్థల పూర్వ  విద్యార్థుల సమ్మేళనానికి  గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన... అంబేద్కర్ స్పూర్తిని కాకా కొనసాగించడం గొప్ప విషయమన్నారు. గొప్ప ఆశయంతో కాకా బీఆర్  అంబేద్కర్ విద్యాసంస్థలు ఏర్పాటు చేశారని చెప్పారు. విద్యతోనే అభివృద్ధి అని కాకా బలంగా నమ్మారని.. పేద ,బడుగు బలహీన వర్గాల కోసం కాకా ఎంతో కృషి చేశారని తెలిపారు.  

కాకా స్ఫూర్తిని వివేక్, వినోద్ కొనసాగించడం గొప్ప విషయమన్నారు. వివిద హోదాల్లో పనిచేసినా కాకా పేదల కోసం పరితపించారని చెప్పారు. ఐదు దశాబ్దాలుగా అంబేడ్కర్ విద్యాసంస్థలు ఎంతో మంది విద్యార్థులను తీర్చి దిద్దాయని చెప్పారు.  ఐదు వేల మందితో నడుస్తున్న  విద్యాసంస్థలు ఇప్పటి వరకు లక్ష మంది పూర్వ విద్యార్థులను  కలిగి ఉండటం గొప్ప విషయం అన్నారు.  పేద, వెనక పడిన విద్యార్థులకు అంబేద్కర్ విద్యాసంస్థలు చేయుతగా నిలుస్తున్నాయని చెప్పారు. 

అంబేడ్కర్ విద్యాసంస్థల పూర్వ విద్యార్థులు వివిధ రంగాల్లో  రాణిస్తున్నారని చెప్పారు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.  మరో 50 ఏళ్లు ఈ విద్యాసంస్థలు సేవలు అందించాలని ఆశిస్తున్నానని చెప్పారు. రాజకీయాలు  కేవలం పదవులను అనుభవించడం కాదు ప్రజల్ని ఎంపవర్ చేయడమని చెప్పారు.