జగిత్యాలలో సీపీఆర్‌‌‌‌‌‌‌‌ చేసి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ పోలీసులు

జగిత్యాలలో సీపీఆర్‌‌‌‌‌‌‌‌ చేసి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ పోలీసులు

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల న్యూ బస్టాండ్ చౌరస్తా వద్ద ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు సీపీఆర్‌‌‌‌‌‌‌‌ చేసి ప్రాణాలు కాపాడారు. పోలీసుల వివరాల ప్రకారం జగిత్యాల న్యూ బస్టాండ్ చౌరస్తా నిలిపి ఉంచిన ఆటోకు ఎక్సెల్ వాహనంపై వస్తున్న జగిత్యాలకు చెందిన రఫీ ఢీకొని కింద పడిపోయాడు. 

అక్కడే డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ ఏఎస్‌‌‌‌ఐ రవీందర్‌‌‌‌‌‌‌‌రావు, హోంగార్డు చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌ వెంటనే స్పృహ కోల్పోయిన రఫీకి సీపీఆర్‌‌‌‌‌‌‌‌ చేసి ప్రాణాలు కాపాడారు. అనంతరం అంబులెన్స్‌‌‌‌లో ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు.