శ్రీశైలంలో 8 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. 

శ్రీశైలంలో 8 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. 

నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలోఫిబ్రవరి 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు ప్రకటించారు.  గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సుమారు 30 శాతం మంది భక్తులు ఎక్కువగా శ్రీశైలం క్షేత్రానికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ అంచనాలకు అనుగుణంగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో  భక్తులకు  ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని  ఏర్పాట్లు చేశారు దేవస్థానం అధికారులు.  ఫిబ్రవరి 8 వ తేదీన ఉదయం శ్రీస్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.  9 వ తేదీనుంచి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి వివిధ వాహన సేవలు .. గ్రామోత్సవం జరుగుతాయి. ఈనెల 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరుపున  భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి  పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 

 మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా  ఈనెల 18 వరకు స్వామి వారి అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతించనున్నారు.  అయితే శివ దీక్ష తీసుకున్న శివస్వాములకు మాత్రం 12 వ తేదీవరకు  నిర్ణీత సమయాల్లో స్పర్శ దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. .

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు గత ఏడాది కంటే ఈ ఏడాది 30 శాతం మంది ఎక్కువుగా శ్రీశైల క్షేత్రానికి వచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేశారు.  భక్తులకు  40 లక్షల లడ్డూలను అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు.   ఈనెల 13 నుండి 16  వరకు భక్తులకు ఉచిత లడ్డు.. 15,16న టోల్​ గేట్ లేకుండానే వాహనాలను అనుమతించనున్నారు.