- ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్
వేములవాడ, వెలుగు: మహా శివరాత్రి జాతరలో భక్తులకు సాఫీగా దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. మహాశివరాత్రికి వేములవాడ భీమేశ్వరస్వామి ఆలయంలో చేస్తున్న ఏర్పాట్లను శుక్రవారం ఆమె పరిశీలించారు. వీఐపీ దర్శనాల కోసం చేసిన ప్రత్యేక ద్వారం, బారీకేడ్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. క్యూలైన్లు పరిశీలించి, నీటిసదుపాయం ఏర్పాట్లను సందర్శించి ఎక్కువ చోట్ల తాగునీటి పాయింట్లు పెట్టి భక్తులకు అందించాలని సూచించారు.
అక్కడి నుంచి బద్ది పోచమ్మ ఆలయ నిర్మాణంలో ఉన్న ఖాళీ స్థలంలో ప్రసాదం కౌంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మొబైల్ టాయిలెట్ల సంఖ్య మరింత పెంచాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ నగేశ్, ఆర్డీవో రాధాబాయి, ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్, తహసీల్దార్ జయంత్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్ తదితరులు ఉన్నారు.
