బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ మూవీ ‘మర్దానీ 3’. అభిరాజ్ మినవాల దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 30న విడుదలైన ఈ చిత్రం ‘మర్దానీ’ ఫ్రాంచైజీలో మూడో భాగంగా తెరకెక్కింది. మహిళల అక్రమ రవాణా, కిడ్నాప్ వంటి అంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
అయితే, ఈ సినిమా ప్రమోషన్ కోసం ఢిల్లీలో మిస్ అయిన అమ్మాయిల అంశాన్ని వాడుకున్నారనే ఆరోపణలు వినిపించాయి. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే తమపై వస్తున్న ఆరోపణలను యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ తీవ్రంగా ఖండించింది.
ఆరోపణలు ఎక్కడ మొదలయ్యాయి: ఇటీవల సోషల్ మీడియాలో ఢిల్లీలో కేవలం 15 రోజుల్లో 800 మందికి పైగా అమ్మాయిలు మిస్సయ్యారనే వార్తలు వైరల్‌గా మారాయి. ఈ అంశం గురించి పలువురు ఇన్‌ఫ్లుయెన్సర్లు పోస్టులు పెట్టడం, అదే సమయంలో మర్దానీ 3 సినిమా విడుదలకు సంబంధించి ప్రమోషన్ జోరుగా సాగడం ప్రజల్లో ఆందోళన కలిగించింది. దీంతో ఈ రెండు అంశాలకు సంబంధం ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
►ALSO READ | Maa Vande: మోడీ బయోపిక్ అప్డేట్.. కాశ్మీర్‌లో మా వందే షూటింగ్..
ఈ వివాదంపై YRF అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. “సున్నితమైన అంశాన్ని ఉద్దేశపూర్వకంగా వాడుకున్నామనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. యశ్ రాజ్ ఫిలిమ్స్ 50 ఏళ్ల చరిత్ర కలిగిన సంస్థ. నైతిక విలువలు, పారదర్శకతకు అధిక ప్రాధాన్యమిస్తూమా ముందుకు సాగుతుంది. మర్దానీ 3 ప్రమోషన్ కోసం ఇలాంటి సున్నితమైన అంశాన్ని ఉద్దేశపూర్వకంగా సంచలనంగా మార్చామనే ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సంబంధిత అధికారులపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. వారు సరైన సమయంలో నిజాలు వెల్లడిస్తారు” అని తెలిపారు. ఈ ప్రకటతో సినిమా ప్రమోషన్‌కు, సోషల్ మీడియాలో ప్రచారమైన రూమర్స్కి ఎలాంటి సంబంధం లేదని సంస్థ స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు కూడా స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన గణాంకాలు నిజమైనవేనని పోలీసులు ధృవీకరించినప్పటికీ, అవి ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే ప్రయత్నాలను చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు. అయితే, మర్దానీ 3 ప్రమోషన్‌ను పోలీసులు నేరుగా తప్పుబట్టలేదు. పరిస్థితిని పరిశీలిస్తున్నామని మాత్రమే తెలిపారు.
ఈ సినిమాకు ‘రైల్వే మెన్’ సిరీస్‌తో మెప్పించిన ఆయుష్ గుప్తా స్క్రిప్ట్‌ను అందించారు. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ శివానీ శివాజీ రాయ్‌గా రాణి ముఖర్జీ నటించింది. దేశంలో అదృశ్యమైపోతున్న అనేక మంది బాలికలను కాపాడేందుకు ఆమె చేసే పోరాటమే ఈ సినిమా కథాంశం. 2014లో తొలిచిత్రం విడుదల కాగా, 2019లో దీనికి సీక్వెల్ వచ్చింది. ఈ రెండూ సూపర్ హిట్ సాధించాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం మర్దానీ 3 హిట్ టాక్తో దూసుకెళ్తోంది.
