ఈ హింస దారుణం..వైభవ్ సూర్యవంశీని అరెస్ట్ చేయాలి...ట్వీట్ వైరల్

ఈ హింస దారుణం..వైభవ్ సూర్యవంశీని అరెస్ట్ చేయాలి...ట్వీట్ వైరల్

 యువ కెరటం వైభవ్ సూర్యవంశీ ..14 ఏళ్ల ఈ చిచ్చర పిడుగు ఇపుడు ఇండియన్ క్రికెటో లో ఓ సంచలనం. ఎందుకంటే ఫిబ్రవరి 6న  జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ లో ఆకాశమే హద్దుగా చెలరేగి విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంచలనం వైభవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూర్యవంశీ (80 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 15 ఫోర్లు, 15 సిక్సర్లతో 175) వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షో చూపెట్టడంతో.. ఇండియా రికార్డు స్థాయిలో ఆరోసారి అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–19 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకుంది.
 
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సూర్యవంశీ పేరే మార్మోగిపోతోంది. వైభవ్ గురించి ప్రస్తుతం ఐస్లాండ్ క్రికెట్ చేసిన ఓ పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోసిన సూర్యవంశీని అరెస్ట్ చేయాలని సరదాగా పోస్టు చేసింది.  ఆ పోస్ట్‌లో "ఎవరైనా ఇప్పుడే వైభవ్ సూర్యవంశీని అరెస్టు చేయండి. ఇంగ్లీష్ బౌలర్లపై మైదానంలో జరిగిన ఈ హింసకు ఎక్స్-రేట్ ఉంది" అని ఐస్లాండ్ క్రికెట్ ట్వీట్‌లో పేర్కొంది. ఈ ట్వీట్ ను ఇండియన్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. 

►ALSO READ | T20 World Cup 2026: తొలి దశలోనే తడబడ్డ నెదర్లాండ్స్... 8 ఓవర్లకే 3 వికెట్స్ డౌన్..

అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ప్రత్యర్థి ఇంగ్లాండ్ పై ఎలాంటి కనికరం చూపెట్టకుండా 80 బంతుల్లోనే 15 ఫోర్లు,15 సిక్సర్లు బాది 175 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లు వైభవ్ ను ఔట్ చేయడానికి ఎన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చిన బంతిని వచ్చినట్టే ఉతికేశాడు. డబుల్ సెంచరీకి 25 పరుగుల దూరంలో ఔటయ్యాడు. అండర్ 19 వరల్డ్ కప్ లో చిరస్థాయిగా నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 

సూర్యవంశీ బద్దలుకొట్టిన రికార్డులు ఇవే:

  • అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్స్ లో అత్యధిక స్కోర్ ( 175 )
  • అండర్ 19 వన్డే చరిత్రలో 100 సిక్సర్లు పూర్తి చేసిన ఫస్ట్ ప్లేయర్ 
  • అత్యంత చిన్న వయసులో అండర్ 19 వరల్డ్ కప్ లో సెంచరీ
  • అండర్ 19 వరల్డ్ కప్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ 
  • ఫైనల్ మ్యాచ్ లో అత్యధిక సిక్సులు
  • అండర్ 19 వరల్డ్ కప్ ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు.

  •