T20 World Cup 2026: తొలి దశలోనే తడబడ్డ నెదర్లాండ్స్... 8 ఓవర్లకే 3 వికెట్స్ డౌన్..

T20 World Cup 2026: తొలి దశలోనే తడబడ్డ నెదర్లాండ్స్... 8 ఓవర్లకే 3 వికెట్స్ డౌన్..

టీ20 వరల్డ్ కప్ 2026 లో భాగంగా పాకిస్తాన్, నెదర్లాండ్స్ మధ్య తొలి మ్యాచ్ ప్రారంభమైంది. కొలంబో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ కి దిగిన పసికూన నెదర్లాండ్స్ తొలిదశలోనే తడబడింది. 8 ఓవర్లకే మూడు వికెట్లు కోల్పోయింది నెదర్లాండ్స్. ప్రస్తుతం 9 ఓవర్లకు గాను మూడు వికెట్లు కోల్పోయి 74 రన్స్ సాధించింది నెదర్లాండ్స్.పాక్ బౌలర్లు సల్మాన్ మిజ్రా, మహమ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు.

అయితే.. ఈ మ్యాచ్‌పై వరుణుడి దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. కొలంబోలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో మ్యాచ్ సజావుగా సాగుతుందా లేదా అనే టెన్షన్ నెలకొంది. ఈ మ్యాచ్ పాకిస్తాన్ కి చాలా కీలకం. ఇండియాతో జరగాల్సిన మ్యాచ్ బాయికాట్ చేసిన క్రమంలో పాకిస్తాన్ సూపర్ 8 కి వెళ్లాలంటే మూడు మ్యాచ్ లలో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. నెదర్లాండ్స్ పై భారీ విక్టరీ సాధించి సూపర్ 8 అవకాశాలను మెరుగుపర్చుకోవాలని ఆశిస్తోంది పాక్.

పాకిస్తాన్ టీం:

సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా (కెప్టెన్), బాబర్ అజామ్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ షా అఫ్రిది, సల్మాన్ మీర్జా, అబ్రార్ అహ్మద్.

నెదర్లాండ్స్ టీం: 

మైఖేల్ లెవిట్, మాక్స్ ఓ డౌడ్, బాస్ డి లీడ్, కోలిన్ అకెర్‌మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్, వికెట్ కీపర్), జాక్ లయన్ కాచెట్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, కైల్ క్లైన్, పాల్ వాన్ మీకెరెన్.