హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం.. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో చెలరేగిన మంటలు

హైదరాబాద్ లో  మరో అగ్ని ప్రమాదం.. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో చెలరేగిన మంటలు

 హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇవాళ ఫిబ్రవరి 7న   ఫోరెన్సిక్ ల్యాబ్ లో  భారీ  అగ్ని ప్రమాదం జరిగింది. బిల్డింగ్ మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలముకున్నాయి. ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. పొగ కమ్మేయడంతో మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బందికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.  ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరాదీస్తున్నారు.

 ఫిబ్రవరి 5న

 ముషీరాబాద్ గాంధీనగర్ లోని ఓ ప్రైవేట్  లేడీస్  హాస్టల్లో   అగ్ని ప్రమాదం జరిగింది.  ఒక్కసారిగా మంటల చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి.  హాస్టల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

అలాగే బాలాపూర్ చౌరస్తా నుంచి బడంగ్‌పేట్ వెళ్లే ప్రధాన రహదారి లెనిన్ నగర్‌లో ఉన్న ఫుడ్ కోర్ట్‌లో  మంటలు చెలరేగాయి.  ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.అప్పటికే ఫుడ్ కోర్టు పూర్తిగా దగ్ధమైంది.

ఫిబ్రవరి 3న 

బంజారాహిల్స్ రోడ్డు 3లో అగ్ని ప్రమాదం జరిగింది. సదరన్ మిర్చి రెస్టారెంట్‎లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన హోటల్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.  

జనవరి 24న 

 నాంపల్లిలోని ఫర్నీచర్ గోదాంలో  అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు చనిపోయారు.