- పలువురికి గాయాలు
జమ్మికుంట, వెలుగు: బ్రిడ్జి రెయిలింగ్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. వివరాలిలా ఉన్నాయి.. ఆర్టీసీ మినీ బస్సు శుక్రవారం హుజూరాబాద్ నుంచి జమ్మికుంటకు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఫ్లై ఓవర్ ఎక్కుతుండగా అదుపుతప్పడంతో రెయిలింగ్‌ను ఢీకొట్టింది.
దీంతో బస్సు ముందు భాగం దెబ్బతినడంతో పాటు టైరు పేలిపోయింది. బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన ప్రయాణికులను 108 సిబ్బంది ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
