బ్లాక్ మెయిల్ చేస్తూ..RTC ఉద్యోగులనుంచి భారీగా డబ్బులు వసూలు..కేటుగాడు అరెస్ట్

బ్లాక్ మెయిల్ చేస్తూ..RTC ఉద్యోగులనుంచి భారీగా డబ్బులు వసూలు..కేటుగాడు అరెస్ట్

హైదరాబాద్:  ఆర్టీసీ ఉద్యోగుల నుంచి భారీగా అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయి.. మీ ఉద్యోగం ఊడ పీకేపిస్తానంటూ బెదిరిస్తూ ఉద్యోగులుంచి అందిన కాడికి దోచుకుంటున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. 

టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగులను బ్లాక్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న  వ్యక్తిని సోమవారం(డిసెంబర్22) కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో దిగిన ఫొటోలను చూపిస్తూ సంస్థ ఉద్యోగులనుంచి భారీగా  దండుకున్నాడు. డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ ఆర్టీసీ ఉద్యోగుల ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ పాల్పడుతున్నాడు కేటుగాడు. ఫొటోలు ఉన్నతాధికారులకు పంపకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులను  బెదిరించాడు మోసగాడు.

ALSO READ : ఇల్లు కొంటున్నారా? ‘బేస్ ప్రైస్’ చూసి మోసపోకండి.. మీ బడ్జెట్ తలకిందులు చేసే సీక్రెట్ ఖర్చులివే.. 

ఇలా  హైదరాబాద్ సిటీలో  విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను మోసం చేసిన 15 కేసులు  వెలుగులోకి వచ్చాయి. దీంతో  నిఘా పెట్టిన పోలీసులు పక్కా ప్రణాళికతో నిందితుడిని అరెస్ట్ చేశారు.