పెళ్లికి నిరాకరించాడని..మీర్ పేట్ లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

పెళ్లికి నిరాకరించాడని..మీర్ పేట్ లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

ప్రేమించిన వ్యక్తి  పెళ్లికి నిరాకరించాడని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్  పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 

 అల్మాస్ గూడ ఎస్ఎస్ఆర్ నగర్ కాలనీలో ఉంటున్న అంబాదళ  అశోక్, రూప అనేద దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో ఒక కూతురు  విహారిక  బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. విహారిక  స్థానికంగా ఉండే జై కిషోర్  కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. జైకిషోర్ పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన విహారిక  డిసెంబర్ 17న ఇంటి నుంచి వెళ్లిపోయింది. డిసెంబర్ 18న విహారికను తీసుకువచ్చి ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు జైకృష్ణ. 

పెళ్లి చేసుకోవాలని విహారిక తల్లిదండ్రులు కోరినా  జై కృష్ణ  నిరాకరించాడు. దీంతో ఆమె ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుంది విహారిక. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కళ్ల ముందే కన్నకూతురు విఘత జీవిగా ఉండటంతో  తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.