హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని బీఆర్ అంబేద్కర్ లా కాలేజీ విద్యాసంస్థల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ చేతుల మీదుగా అంబేద్కర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ డాక్టర్ సరోజ వివేక్ నేషనల్ అవార్డు అందుకున్నారు.
ప్రజా సంక్షేమం కోసం కాకా కృషి: సరోజ వివేక్
ఇందిరా గాంధీ, సోనియా గాంధీ హయాంలో కాకా రాజకీయాల్లో ఉంటూ ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారు. కాకా వెంకట స్వామి పేదలకు నాణ్యమైన విద్య అందించాలని ఆదర్శంగా తీసుకొని అంబేద్కర్ విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. చుదువుకోవాలని ఆయన దగ్గరకు వచ్చిన అందరినీ చదివించారు. మా విద్యార్థుల ఎలాంటి డొనేషన్స్ తీసుకోకుండా పేద విద్యర్థులకు విద్య అందిస్తున్నాం. 80 శాతం మార్క్ లు సాధించిన వారికి స్కాలర్ షిప్స్ అందిస్తున్నాం. అంబేద్కర్ విద్యాసంస్థల నుంచి లా కాలేజీ విద్యార్థులు దుబాయ్ లో ఇంటర్న్ షిప్ లో చేస్తున్నారు. మా కాలేజీ విద్యార్థులు కజకిస్థాన్ కు ఎడ్యుకేషన్ ఎక్స్ చేంజ్ కోసం సెలెక్ట్ అయ్యారు.
50 సంవత్సరాల నుంచి విద్యార్థులు కలవడం ఆనందంగా ఉంది. ఇంత మంది అంబేద్కర్ పూర్వ విద్యార్థుల కార్యక్రమం నిర్వహించడం గర్వంగాఉంది. అంబేద్కర్ విద్యా సంస్థల గోల్డెన్ జూబ్లీ అల్యుమినై కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ రావడం ఆనందంగా ఉంది. కాకా వెంకటస్వామి ఆదర్శాలకు అనుగుణంగా విద్యా సంస్థలు కొనసాగిస్తాం. విద్యార్థులకు అన్ని విధాల అండగా ఉంటాం. అని సరోజ వివేక్ అన్నారు.
