హైదరాబాద్ రాయదుర్గంలో హాస్టల్లో ఉంటూ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు ఎస్ఓటీ పోలీసులు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని లివింగ్ గార్నెట్ పీజీ హాస్టల్లో ఉంటూ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. పక్కా సమాచారంతో సోమవారం ( డిసెంబర్ 22 0 హాస్టల్ పై ఆకస్మిక దాడులు నిర్వహించిన పోలీసులు ఐదుగురు సభ్యులు గల ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
నిందితులను అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు వారి దగ్గర నుంచి 12 గ్రాముల MDMA, 7 గ్రాముల OG గాంజా, 6 మొబైల్ ఫోన్లు, 60 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. పట్టుబడ్డ ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. ఇదిలా ఉండగా..కొంపల్లిలో భారీ డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. ప్రేమ, సహజీవనం పేరుతో అమ్మాయిలకు వల వేసి డ్రగ్స్ దండలోకి దింపుతున్న వ్యక్తిని పట్టుకున్నారు నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. పక్కా సమాచారంతో ఆకస్మిక దాడులు నిర్వహించిన అధికారులు ఆదివారం (డిసెంబర్ 21 ) నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
ALSO READ : పెళ్లికి నిరాకరించాడని..మీర్ పేట్ లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
ప్రేమ, సహజీవనం పేరుతో అమ్మాయిలను వలలో వేసుకొని.. వారినే ఏజెంట్లుగా నియమించి డ్రగ్స్ దందా చేస్తున్నాడు నిందితుడు.కొంపల్లిలో నర్స్ గా పనిచేస్తున్న యువతని ట్రాప్ చేసిన నిందితుడు ఆమె ఇంట్లోనే మత్తుప్రదార్థాలు ఉంచి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు.డ్రగ్స్ అమ్మకాలకు కోడ్ భాష ఉపయోగిస్తున్నట్లు గుర్తించామని.. నిందితుడు స్టూడెంట్ వీసా పై ఇండియాకు వచ్చినట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. డ్రగ్స్ దందా కోసం హైదరాబాద్, బెంగళూరు, గోవాలో ఐదు ఇళ్ళను అద్దెకు తీసుకున్నట్టు గుర్తించారు పోలీసులు.
