కారులో మ్యూజిక్ సౌండ్ తగ్గించమంటే..మహిళపై దాడి చేసిన ర్యాపిడో క్యాబ్ డ్రైవర్ అరెస్ట్..

కారులో మ్యూజిక్ సౌండ్ తగ్గించమంటే..మహిళపై దాడి చేసిన ర్యాపిడో క్యాబ్ డ్రైవర్ అరెస్ట్..

కారులో మ్యూజిక్ సౌండ్ తగ్గించమంటే మహిళపై దాడి చేసిన ర్యాపిడో క్యాబ్ డ్రైవర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. కారులో ఎక్కువ సౌండ్ తో మ్యూజిక్ ప్లే చేయడమే కాకుండా.. సౌండ్ తగ్గించమని అడిగిన మహిళా ప్యాసెంజర్ పట్ల అసభ్యకరంగా మాట్లాడి, నిర్మానుష్యంగా ఉన్న చోటు వదిలేసి వెళ్ళాడు ఓ క్యాబ్ డ్రైవర్. గుర్గావ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. రోహ్తక్‌లోని బహ్ని మహారాజ్‌పూర్‌కు చెందిన పంకజ్‌ అనే ర్యాపిడో డ్రైవర్ ను సెక్టార్ 50లో అదుపులోకి తీసుకుని, అతడి క్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ALSO READ | సెక్యులర్ పాట పాడాలని నన్ను వేధించారు..బెంగాలీ సింగర్ ఆరోపణ

డిసెంబర్ 15న బాధితురాలు ఆఫీసు నుండి బయటకు వచ్చి సాయంత్రం 6 గంటల సమయంలో రాపిడో క్యాబ్ బుక్ చేసుకుంది. ఓటీపీ ఎంటర్ చేసి రైడ్ స్టార్ట్ చేశాడు డ్రైవర్. రైడ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ఎక్కువ సౌండ్ తో మ్యూజిక్ ప్లే చేయడం స్టార్ట్ చేశాడు డ్రైవర్. దీంతో వాల్యూం తగ్గించాలని డ్రైవర్ ను రిక్వెస్ట్ చేసింది బాధితురాలు. తనకు ఫోన్ కాల్ వచ్చిందంటూ మహిళ పలు మార్లు సౌండ్ తగ్గించాలని అడిగినా పట్టించుకోలేదు డ్రైవర్.

వాల్యూం తగ్గించమని బాధితురాలు పలుమార్లు రిక్వెస్ట్ చేసినా పట్టించుకోని డ్రైవర్ తిరిగి ఆమెను తిట్టడం మొదలుపెట్టాడు. ఇదేమైనా మీ నాన్న కారా..?, నేనేం చేయాలో నువ్వు చెబుతావా...? ఆమెను దూషించడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగని డ్రైవర్ క్యాబ్ ను తెలీని ప్రాంతానికి తీసుకెళ్లి నేనంటే ఏంటో ఇప్పుడు చూపిస్తానంటూ నిర్మానుష్యమైన ప్రాంతంలో కారు ఆపి.. ఆమెను బలవంతంగా దింపేశాడు. 

అంతే కాకుండా తన పట్ల తప్పుడు ఉద్దేశంతో చూడటం ప్రారంభించాడని.. తాను ప్రమాదంలో పడ్డట్లు అనిపించిందని తెలిపింది బాధితురాలు.బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.