జపాన్లో మంచు తుఫాన్.. 35 మంది మృతి..

జపాన్లో మంచు తుఫాన్.. 35 మంది మృతి..
  • కరెంట్ లేక ప్రజల ఇబ్బందులు
  • బుల్లెట్ రైళ్లు నిలిపివేసిన ప్రభుత్వం 

టోక్యో: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భీకర మంచు ఉత్తర జపాన్ ను వణికిస్తున్నది.  జపాన్లోని 15 ప్రిఫెక్చర్లు ప్రభావితమైనట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 35 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇండ్ల వద్ద మంచును తొలగించే క్రమంలో ప్రమాదానికి గురై చాలామంది మరణించినట్టు తెలిస్తుంది.

 ప్రభా విత ప్రాంతాల్లో ఇండ్లనుంచి బయటకు వెళ్లలేక, విద్యుత్తు సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. బుల్లెట్ రైళ్లు సహా చాలా రైలు మార్గాలు నడవటం లేదని ప్రభుత్వం తెలిపింది.

►ALSO READ | అగ్రికల్చర్, డెయిరీ రంగాలకు నష్టం ఉండదు: US ట్రేడ్ డీల్‎పై గోయల్ ప్రకటన