అమెరికాకు మర్చిపోలేని గుణపాఠం చెబుతం: మోజ్తబా ఖమేనీ

అమెరికాకు మర్చిపోలేని గుణపాఠం చెబుతం: మోజ్తబా ఖమేనీ

టెహ్రాన్: అమెరికా, ఇరాన్‎ల మధ్య ఇటీవల కుదిరిన మద్యంతర శాంతి ఒప్పందానికి విలువే లేదని ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ తేల్చిచెప్పారు. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ద్వారా డొనాల్డ్ ట్రంప్ సంతకానికి ఏమాత్రం విలువలేదనే విషయాన్ని అమెరికా ప్రపంచానికి చాటిచెప్పిందన్నారు. ఈమేరకు శనివారం మోజ్తబా ఖమేనీ తమ దేశ పౌరులను ఉద్దేశిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. యుద్ధానికి ప్రేరేపిస్తున్న శత్రువు (అమెరికా)కు మర్చిపోలేని గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. యుద్ధ పరిణామాలను ఆ దేశానికి రుచి చూపిస్తామని మోజ్తబా పేర్కొన్నారు.

అంతర్గతంగా పెను సంచలనం..!

ఓవైపు యుద్ధం తీవ్రమవుతున్న వేళ ఇరాన్‌‌‌‌‌‌‌‌ అంతర్గత రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై అతివాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయతుల్లా అలీ ఖమేనీ మరణం, మోజ్తబా ఖమేనీ అజ్ఞాతాన్ని ఆసరాగా చేసుకుని ‘‘అధికారాన్ని చేజిక్కించుకునే కుట్రలు పన్నుతున్నారు” అంటూ బాఘెర్ గాలిబాఫ్, పెజెష్కియాన్​లపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.