M.Sc, M.Tech పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్ : ONGC లో భారీ జీతంతో ఉద్యోగాలు!

M.Sc, M.Tech పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్ : ONGC లో భారీ జీతంతో ఉద్యోగాలు!

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్ జీసీ) జియాలజిస్ట్‌, ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 
పోస్టు పేరు: జియాలజిస్ట్‌, ఇంజినీర్ (ఈ1 లెవెల్).
మొత్తం ఖాళీలు: 52. 
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో 60 శాతం 
మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. 
సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఎంఎస్సీ/ ఎం.టెక్ పూర్తిచేసి ఉండాలి. 
గరిష్ట వయోపరిమితి: 27 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జులై 17.
లాస్ట్ డేట్: జులై 31. 
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్​నెస్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.ongcindia.comను సందర్శించండి.