చైనాలో విరిగిపడిన కొండచరియలు.. 8 మంది మృతి, 34 మంది గల్లంతు

చైనాలో విరిగిపడిన కొండచరియలు.. 8 మంది మృతి, 34 మంది గల్లంతు

బీజింగ్/చాంగ్కింగ్: నైరుతి చైనాలోని చాంగ్కింగ్ నగరంలో కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి చెందారు. మరో 34 మంది గల్లంతయ్యారు. చాంగ్కింగ్ శివార్లలోని పెంగ్‌‌‌‌‌‌‌‌షుయ్ కౌంటీలో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ ప్రమాదం జరిగింది. కొండపై నుంచి భారీ ఎత్తున రాళ్లు, మట్టి ఒక్కసారిగా కిందకు దూసుకురావడంతో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. 

సుమారు 3,000 క్యూబిక్ మీటర్ల పరిమాణం ఉన్న ఓ పెద్ద బండరాయి కొండపై నుంచి దూసుకురావడంతో పలు ఇండ్లు, వెహికల్స్‌‌‌‌‌‌‌‌ నేలలో కూరుకుపోయాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని 1,100 మందిని సరక్షిత ప్రాంతాలకు తరలించారు.