ఎన్ఐసీఎల్ లో 500 అసిస్టెంట్ పోస్టులు.. డిగ్రీ అర్హత ఉంటే చాలు, వెంటనే అప్లై చేసుకోండి!

ఎన్ఐసీఎల్ లో 500 అసిస్టెంట్ పోస్టులు.. డిగ్రీ అర్హత ఉంటే చాలు, వెంటనే అప్లై చేసుకోండి!

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఐసీఎల్) క్లాస్-–III కేటగిరీలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 18 నుంచి ప్రారంభం కానుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టు పేరు: అసిస్టెంట్ (క్లాస్ III).
మొత్తం ఖాళీలు: 500.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 
అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకునే రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన ప్రాంతీయ భాషలో చదవడం, రాయడం, మాట్లాడటంలో తప్పనిసరిగా నైపుణ్యం కలిగి ఉండాలి. 
వయోపరిమితి: 21 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జులై 18.
లాస్ట్ డేట్: ఆగస్టు 7.
ఫేజ్–I ఆన్​లైన్ ఎగ్జామినేషన్ తేదీ: ఆగస్టు 27.
ఫేజ్–II ఆన్​లైన్ ఎగ్జామినేషన్ తేదీ: అక్టోబర్ 30. 
సెలెక్షన్ ప్రాసెస్: ఫేజ్–-I ఆన్​లైన్ ఎగ్జామినేషన్, ఫేజ్–-II ఆన్​లైన్ ఎగ్జామినేషన్, రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ nationalinsurance.nic.co.inను సందర్శించండి.