ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రాజమండ్రిలో మొదటి కరోనా కేసు నమోదయ్యింది. దీంతో ఏపీలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 16కు చేరింది. ఆదివారం ( జులై 19 ) రాజమండ్రిలో 21ఏళ్ళ యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్దారించారు అధికారులు. యువకుడిని రాజమండ్రి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు అధికారులు.
ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆస్పత్రుల్లో ఐదుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు. నలుగురు బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉండగా... ముగ్గురు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు కోవిడ్ తో నలుగురు మృతి చెందారు.ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.
ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్న కేసు ఒమిక్రాన్ ఆర్5 వేరియంట్ గా గుర్తించారు. ఈ వేరియంట్ సోకినవారిలో గొంతు నొప్పి, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం,అలసట, బాడీపెయిన్స్, లాంటి లక్షణాలు ఉంటాయని చెబుతున్నారు వైద్యులు. ఈ వేరియంట్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... చికిత్స తీసుకుంటే నయం అవుతుందని అంటున్నారు వైద్యులు.
