ఏపీ పాలిటిక్స్ లో తీవ్ర దుమారం రేపిన కాదంబరి జత్వాని కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సీఐడీ దాఖలు చేసిన చార్జిషీటు రిటర్న్ కావడంతో మరో చార్జిషీట్ కోర్టుకు సమర్పించారు అధికారులు. ఈ చార్జిషీటులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. నటి కాదంబరి జత్వానినే విద్యాసాగర్ ను బ్లాక్ మెయిల్ చేసినట్లు నిర్దారించింది సీఐడీ. ఇందుకు సంబంధించిన ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేసింది సీఐడీ.
తనతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలతో జత్వానీ బెదిరించిందని... పరువు కాపాడుకునేందుకు తరుచూ డబ్బులిచ్చానని ఫిర్యాదులో పేర్కొన్నారు విద్యాసాగర్. జత్వానీకి రూ.కోటి 32 లక్షలు విద్యాసాగర్ చెల్లించినట్లు గుర్తించింది సీఐడీ. జత్వానీ, ఆమె తల్లి ఉమ్మడి ఖాతాకుజాయింట్ అకౌంట్ కు విద్యాసాగర్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేసినట్టు ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది సీఐడీ.
విద్యాసాగర్ ను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి... డబ్బులు వసూలు చేసినట్లు జత్వానిపై కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు.వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి పోలీసు అధికారులు తనను నిర్బంధించి చిత్ర హింసలు పెట్టారని కూటమి ప్రభుత్వం వచ్చాక ఫిర్యాదు చేసింది నటి జత్వాని.
ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది సీఐడీ. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కుంటున్న పోలీస్ అధికారులను సస్పెండ్ చేయగా...ఇప్పుడు ఈ కేసులో సీఐడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ రిటర్న్ కావటంతో.. కోర్టుకు మరో చార్జిషీట్ సమర్పించారు అధికారులు.
