జ్యోతిష్యం:పెళ్లైన తరువాత కొత్త దంపతులు.. మొదట చేయాల్సిన పని ఇదే..!

జ్యోతిష్యం:పెళ్లైన తరువాత  కొత్త దంపతులు.. మొదట చేయాల్సిన పని ఇదే..!

ఎక్కడో పుట్టిన అమ్మాయి.. మరెక్కడో జన్మించిన అబ్బాయికి లగ్గం కుదురుస్తారు.  కుటుంబ ఆచారాలు.. సంప్రదాయాలు.. ఇష్టదైవాలు.. ఇలా మరెన్నిటికో పొంతన ఉండదు.  కాని హిందూ ఆచారాల ప్రకారం..  కన్యాదానంతో వేరే ఇంటి ఆచారాలు పాటించాలి.  ఇక ఆ అమ్మాయి మెడలో  .. అబ్బాయి మూడు ముళ్లు వేశాడంటే  వారిని దంపతలు.. భార్యభర్తలు.. ఆలుమగలు  ఇలా సంబోధిస్తుంటారు. సాధారణంగా ఎవరి ఆచారాల ప్రకారం.. పెళ్లి తంతు ముగుస్తుంది.  ఆ తరువాత  అప్పుడే తన జీవితంలోకి అడుగుపెట్టిన భార్యను తీసుకొని భర్త ఇంటికి వస్తాడు.  వచ్చీ రాగానే ముందుగా కొన్ని పనులు చేయాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు వాటి గురించి  తెలుసుకుందాం. . .! 

పురాణాల ప్రకారం.. అప్పటి వరకు .. ఆటలు ఆడుతూ.. పాటలు పాడిన జీవితం.. యుక్తవయస్సు వచ్చేసరికి ఎప్పుడూ కలవని.. ఎప్పుడూ చూడని అబ్బాయికి.. అమ్మాయికి పెళ్లి అనే పేరుతో ముడిపెడతారు.  ఈ వివాహంలో చాలా తంతులు ఉంటాయి.  ఎన్నో పవిత్రమైన మంత్రాలు ఉంటాయి.  వాటితో వారిద్దరి కుటుంబాలను శాస్త్రం ప్రకారం కలుపుతారు.    అసలు వివాహం అనేది రెండు శరీరాల కలయిక కాదు..రెండు ఆత్మల పవిత్రమైన సమ్మేళనం అని పండితులు చెబుతున్నారు. 

హిందూ శాస్త్రాల ప్రకారం పెళ్లి అయిన తరువాత గృహస్థాశ్రమం ప్రారంభమవుతుంది.  సంప్రదాయం ప్రకారం భర్త ఇంటిలోనే భార్య ఉండాలి. కొత్త పెళ్లి అయిన తరువాత భార్యభర్తలచే  గృహప్రవేశం చేయించే ఆచారం ఉంది. ప్రధాన గుమ్మం దగ్గరకు రాగానే పెద్దలు కొత్త దంపతులకు హారతి ఇస్తారు.  ఆ తరువాత ముందుగా ఇకపై తన ఇల్లే అని భావించి.. ముందుగా (భార్య)  గడపకు నమస్కరించాలి.  ఆ తరువాత ఇంటిలోని దేవుని మందిరం దగ్గరకు వెళ్లి కొత్త దంపతులు వెళ్లి.. దీపారాధన చేసి.. భార్యభర్తలు కలిసి ప్రార్థన,  ధూపం.. నైవేద్యం .. ఆతరువాత కులదైవాన్ని( భర్త) ప్రార్థించాలి.  ఇవన్నీ కొత్తగా వచ్చిన ఆమెకు తెలియదు.. అత్తగారు.. మామగారు.. భర్త  ఆమెతో చెపుతూ వారు చేస్తూ.. ఆమెతో కూడా చేయించాలి.

ఇంటిలోకి హడావిడిగా వెళ్లి ఈ పనులు అన్నీ చేయడం కొంతమందికి సాధ్య పడదు.. అలాంటి వారు పెళ్లి తరువాత కొత్త దంపతులతో చేయించే వ్రతంలో చేయాలని పండితులు చెబుతున్నారు. 

కొత్త జీవితం.. దాంపత్య జీవితం.. అంతా దేవుని రక్షణలో ఉంటుందని పండితులు చెబుతున్నారు. భగవంతుని ఆశీస్సులు తీసుకోవాలి.  ఇరు కుటుంబాల పెద్దల ఆశీర్వాలు తీసుకోవాలి.  ఇలా చేయడం వలన జీవితంలో సుఖం.. సంతోషం.. సంపదలు వస్తాయని పండితులు చెబుతున్నారు. 

కొత్తగా పెళ్లి అయిన తరువాత దంపతులు శక్తి కొలది దానాలు ఇవ్వాలి.  అందుకే బంధువులందరికి భోజనాలు పెట్టడం( అన్నదానం), బట్టలు పెట్టడం ( వస్త్రదానం), గిఫ్ట్​లు ఇవ్వడం లాంటివి చేస్తుంటారు.  మరో ముఖ్యమైన విషయం ఏంటంటే గో సేవ చేయడం ద్వారా భార్య భర్తల సంబంధం మరింత బలపడుతుందని పండితులు చెబుతున్నారు. 

ఆ తరువాత భర్త ఇంటి ఆచారం  పుణ్యక్షేత్రాలను దర్శించే ఆచారం ఉంటే తప్పక అక్కడకు పసుపు బట్టలతో ( తలంబ్రాలు పోసుకున్న దుస్తులతో)  వెళ్లి ఆ స్వామిని దర్శించుకోవాలి.  అవకాశం లేకపోతే ఆ దేవుని స్మరించుకొని ప్రార్థించాలి.  పురాణాల ప్రకారం.. వివాహం తరువాత మొదటచేసే పుణ్యకార్యం.. వారి జీవితంలో  దైవిక శక్తిని అందిస్తుందని పండితులు చెబుతున్నారు.  

కాని ప్రస్తుత ట్రెంట్​ ప్రీ వెడ్డింగ్​ షూట్స్​.. వీడియో తీసేవారికి.. ఫొటోలు తీయడానికి ఇచ్చిన ఇంపార్టెన్స్​ ఆచారాలకు ఇవ్వడం లేదు. ఇలా చేయడం ఏ మాత్రం శ్రేయస్కరం మంచిది కాదని పండితులు చెబుతున్నారు.  అసలు కన్యాదానం కాకుండా భార్యభర్తలు ఇద్దరు పక్క పక్కన కూర్చోకూడదు. బంధు వర్గంలో  సంబంధాలు కుదిరితే నిశ్చయమైన దగ్గరినుంచి పక్కపక్కన కూర్చోకూడదు.  ఒకవేళ కూర్చోవలసిన పరిస్థితి వస్తే వారిద్దరి మధ్య ఒక బిందెను నీళ్లతో నింపి ఉంచాలని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. 

ఇవన్నీ కేవలం ఆచారాలు.. సంప్రదాయాలు మాత్రమే కాదు.  భార్య భర్తల మధ్య ప్రేమకు పునాది.  రెండు కుటుంబాల మధ్య గౌరవం.. ప్రేమ.. దైవభక్తి.. కలిగి ఆ ఇల్లు సంతోషంగా ఉంటుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. 

ఆధ్యాత్మికంగా చూస్తే...వివాహం తర్వాత దంపతులు కలసి చేసే మొదటి పుణ్యకార్యం వారి జీవితానికి దైవిక శక్తిని అందిస్తుంది. ఇది కేవలం ఆచారాలు మాత్రమే కాదు..ధర్మం కరుణ భక్తికి పునాది. పరస్పర గౌరవం, ప్రేమ, సహనం, దైవభక్తి... ఈ శుభారంభంతోనే ఇల్లు సంతోషంగా మారుతుంది

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.