ఇద్దరు అన్నదమ్ములు....అందరు చూడటానికి ఇద్దరు తాపీ మేస్త్రీలు...చేసేదీ మాత్రం మోటర్ల చోరీలు.. ఒక్కరివి కాదూ ఇద్దరివి కావు..ఏకంగా ఊరి రైతులందరి మోటర్లు,స్టాటర్లు,వైర్లు అన్ని అపహరించుకువచ్చి ఇళ్లు నింపారు.ఇంటి నిండా దాచిన మోటర్లను చూసి జనమే కాదు పోలీసులు సైతం అవాక్కయ్యా రు.మోటర్లు ఎంటీ..ఇంట్లో దాచిపెట్టుకోవటం ఎంటీ అని ఆశ్చర్యపోతున్నారా అయితే ..మీరే చూడండీ.
వరంగల్ సమీపంలోని అల్లి తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు రొయ్యల రాజేష్ , రొయ్యల నరేష్. వీరిద్దరు ఊరిలో తాపీ పని చేసుకుంటా జీవనం సాగిస్తున్నారు. తాపీ మేస్త్రీ పనికి పోయిన దగ్గర ఎవరు లేని సమయంలో మోటర్లు, వైర్లు అపహరించుకుని రావటం మొదలెట్టారు.అలానే ఇళ్లలోని మోటర్లు స్టార్టర్లు, పైపులు, మోటర్ల వైర్లు దొంగతనాలకు పాల్పడుతూ వస్తున్నారు.గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాల సందర్భంగా మోటార్లకు స్టార్టర్లు పెట్టారు.అ రాత్రి స్టార్టర్లు అపహరించుకుని వెల్లారు అన్నదమ్ములు.
వీరిపై ఊరి పెద్దలకు అనుమానం వచ్చి...గ్రామ పంచాయితి వద్దకు పిలిచారు. అక్కడికి రాజేష్ ,నరేష్ ఇద్దరు రాకుండా తప్పించుకుని పారిపోయారు. గ్రామ పెద్దలు ఇంట్లోకి వెళ్లి చూడగా....ఇంటి నిండా మోటర్లు వైర్లు,వైర్లు, సౌండ్ బాక్సులు, కరెంట్ వైర్లు, ఇతర వస్తువులు చూసి ఊరి ప్రజలు అందర్ షాక్ గురయ్యారు.
ALSO READ : హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ చోరీ..
వెంటనే పోలీసులకు సమాచారం అందించారు..మోటర్లు,స్టాటర్లు,అపహరించుకుని వచ్చిన వస్తువులు పోలీసులు స్వాదినం చేసుకున్నారు.ట్రాక్టర్లలో మామునూరు పోలీసులు తీసుకుని వెళ్లారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పరారీలో ఉన్న అన్నదమ్ముల కోసం గాలిస్తున్నారు పోలీసులు.
