హైదరాబాద్ లేడీస్ హాస్టల్లో పేలిన గీజర్.. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం పొగలు, మంటలు

హైదరాబాద్ లేడీస్ హాస్టల్లో పేలిన గీజర్.. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం పొగలు, మంటలు

హైదరాబాద్: ముషీరాబాద్ పరిధి గాంధీనగర్ లోని ఓ లేడీస్ హాస్టల్లో అగ్నిప్రమాదం జరిగింది. సుధామ పీజీ అకామిడేషన్ ఫర్ విమెన్ హాస్టల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన యువతులు బయటకు పరుగులు తీశారు. భవనంలో చిక్కుకున్న ఇద్దరు యువతులను స్థానికులు నిచ్చెన సాయంతో కిందకు దించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, హైడ్రా డీఆర్ఎస్ చెందిన 3 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

* హైదరాబాద్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్లోని విమెన్  హాస్టల్లో అగ్ని ప్రమాదం 

* హాస్టల్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
* సుధామ పీజీ అకామిడేషన్ ఫర్ విమెన్ హాస్టల్లో అగ్ని ప్రమాధం
* మూడు ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను అదుపు చేస్తున్న అగ్ని  మాపక సిబ్బంది, హైడ్రా సిబ్బంది 
* షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్న పోలీసులు
* గాంధీ నగర్లోని సుధామ విమెన్స్ హాస్టల్ మొదటి ఫ్లోర్లో చెలరేగిన మంటలు
* హాస్టల్ రూమ్లో వాష్ రూమ్లో పేలిన గీజర్
* ప్రమాదం జరిగినప్పుడు లాక్ వేసి ఉన్న రూమ్
* మంటలు పక్క రూమ్కు వ్యాపించడంతో భయాందోళనకు గురైన అమ్మాయిలు
* మంటలతో కిందకు దిగలేకపోయిన ఇద్దరు అమ్మాయిలు
* అప్రమత్తం అయిన పక్క హాస్టల్ యువకులు
* నిచ్చెన సహాయంతో అమ్మాయిలను కిందకు సురక్షితంగా తీసురావడంతో తప్పిన ప్రాణ నష్టం