ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. అత్యంత కన్సిస్టెంట్ టీమ్ గా పేరున్న ఢిల్లీ చాంపియన్స్ ఓపెనర్లు దూకుడు మీద ఆడుతున్న సమయంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వెంట వెంటనే ఓపెనర్లు కోల్పోయి ఢిల్లీ కష్టాల్లో పడింది. తొలి వికెట్ షఫాలీ వర్మ 13 బాల్స్ లో 20 రన్స్ (3 ఫోర్లు) చేసి అరుంధతి రెడ్డి బౌలింగ్ లో ఔటయ్యింది. 49 రన్స్ దగ్గర కీపర్ రిచా ఘోష్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది.
షఫాలీ వర్మ ఔటైన తర్వాత కాసేపటికే.. మరో డ్యాషింగ్ ఓపెనర్ లిజెల్లీ లీ 8వ ఓవర్లో 37 రన్స్ (30 బాల్స్ లో) తన వ్యక్తిగత స్కోర్ దగ్గర ఔటయ్యింది. నదినే డి క్లర్క్ బౌలింగ్ లో గ్రేస్ హారిస్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఓపెనింగ్ నుంచి దూకుడుగా ఆడుతూ వచ్చిన లీ.. 3 ఫోర్లు, 3 సిక్సులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది.
ఇన్నింగ్స్ కాస్త స్లోగా ప్రారంభించిన షెఫాలీ వర్మ.. ఆ తర్వాత దూకుడు పెంచి ఆడుతున్న క్రమంలో ఔటవ్వడం ఢిల్లీకి మైనస్.
దూకుడుమీదున్న ఢిల్లీ ఓపెనర్ల జోడీని హైదరాబాద్ బౌలర్ అరుంధతీ రెడ్డి విడదీసింది. 6వ ఓవర్లో 5వ బాల్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరుకుంది షెఫాలీ వర్మ. ఆ తర్వాత మరో ఓపెనర్ లీ కూడా వెనుదిరగటంతో.. బెంగళూర్ పట్టు సాధిస్తున్నట్లు కనిపించింది. కానీ తర్వాత వచ్చిన వాల్వార్ట్, రోడ్రిగ్స్ కూడా అదే స్పీడ్ కొనసాగిస్తుండటంతో ఢిల్లీ 10 ఓవర్లకు 96 రన్స్ కు చేరుకుంది.
►ALSO READ | WPL 2026 Final: టాస్ RCB దే.. బౌలింగ్ ఎంచుకున్న స్మృతి.. బిగ్గెస్ట్ రీజన్ ఇదే !
దూకుడుమీదున్న ఢిల్లీ ఓపెనర్ల జోడీని హైదరాబాద్ బౌలర్ అరుంధతీ రెడ్డి విడదీసింది. 6వ ఓవర్లో 5వ బాల్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరుకుంది షెఫాలీ వర్మ.
