WPL 2026 Final: టాస్ RCB దే.. బౌలింగ్ ఎంచుకున్న స్మృతి.. బిగ్గెస్ట్ రీజన్ ఇదే !

WPL 2026 Final:  టాస్ RCB దే..  బౌలింగ్ ఎంచుకున్న స్మృతి.. బిగ్గెస్ట్ రీజన్ ఇదే !

ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఉమెన్స్ వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ వర్సెస్ బెంగళూరు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కెప్టెన్ స్మృతి మంధాన బౌలింగ్ ఎంచుకుంది. 2024 ఫైనల్ రిజల్ట్స్ ను దృష్టిలో ఉంచుకుని.. ఈ సీజన్ లో కూడా బౌలింగ్ ఎంచుకోవడం గమనార్హం.

2024 ఫైనల్ లో కూడా ఢిల్లీ, బెంగళూర్ తలపడిన విషయం తెలిసిందే. ఆ సీజన్ లో టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. బెంగళూర్ కప్ గెలుచుకుంది. ఈ సారి టాస్ బెంగళూర్ కు అనుకూలించగా.. ఫీల్డింగ్ ఎంచుకుంది కెప్టెన్ మంధాన.

టైటిల్ క్లాష్ లో బెంగళూర్ కెప్టెన్ స్మృతి మంధాన, ఢిల్లీ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్జ్ తలపడుతున్నారు. 2024లో బెంగళూర్ చేతిలో ఓడిన ఢిల్లీ ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలనే కసితో ఉంది. అదే క్రమంలో ఢిల్లీని మళ్లీ మట్టి కరిపించి ముంబైతో సమానంగా రెండో సారి కప్ గెలుచుకున్న టీమ్ గా నిలవాలని బెంగళూర్ ప్లాన్ లో ఉంది. 

ప్లేయింగ్ 11:

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): లిజెల్ లీ(w), షఫాలీ వర్మ, లారా వోల్వార్డ్ట్, జెమిమా రోడ్రిగ్స్(సి), మారిజాన్ కాప్, చినెల్లె హెన్రీ, నికి ప్రసాద్, స్నేహ రాణా, మిన్ను మణి, శ్రీ చరణి, నందనీ శర్మ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ప్లేయింగ్ XI): గ్రేస్ హారిస్, స్మృతి మంధాన(సి), జార్జియా వోల్, రిచా ఘోష్(w), రాధా యాదవ్, నాడిన్ డి క్లెర్క్, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, సయాలి సత్‌ఘరే, శ్రేయంక పాటిల్, లారెన్ బెల్

►ALSO READ | WPL 2026 Final: RCBని పడగొట్టి ఢిల్లీ కప్పు గెలుస్తుందా..? ఢిల్లీని తక్కువ అంచనా వేయలేం.. ఎందుకంటే..