ఆధ్యాత్మికం : మంగళవారం అమావాస్య రోజు సూర్యగ్రహణం : మనుషులపై దీని ప్రభావం ఏంటీ..?

ఆధ్యాత్మికం : మంగళవారం అమావాస్య రోజు సూర్యగ్రహణం : మనుషులపై దీని ప్రభావం ఏంటీ..?

ప్రకృతిలో ఎక్కడో జరిగే మార్పులు మనుషులపై ప్రభావం చూపిస్తాయా.. ముఖ్యంగా సూర్య, చంద్ర గ్రహణాల ప్రభావం పురాణాల నుంచి ఉంది. 2026 మొదటి సూర్య గ్రహం ఏర్పడుతుంది. అది కూడా అమావాస్య రోజున.. అందులోనూ మంగళవారం.. ఇలాంటి సూర్య గ్రహం ఎప్పుడు వస్తుంది.. ఏ తేదీన వస్తుంది.. భారతదేశంలో దీని ప్రభావం ఏంటో వివరంగా తెలుసుకుందాం..

సూర్యగ్రహణం ఎప్పుడు..? :

2026, ఫిబ్రవరి 17వ తేదీన సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఆ రోజు అమావాస్య. ఆ రోజు మంగళవారం. మంగళవారం నాడు అమావాస్య రోజు వస్తుంది. మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాలకు గ్రహణం ప్రారంభం అవుతుంది. రాత్రి 7 గంటల 57 నిమిషాలకు ముగుస్తుంది. 

రింగ్ ఆకారంలో సూర్య గ్రహణం ఇండియాలో కనిపిస్తుందా..? :

రింగ్ అంటే కంకణం ఆకారంగా సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఇది భారతదేశంలో కనిపించదు. భారత దేశ భూభాగం నుంచి ఈ సూర్యగ్రహణాన్ని చూడలేరు జనం. ఈ సూర్య గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడాలంటే మీరు దక్షిణాఫ్రికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, జింబాబ్వే, మారిషస్, నమీబియా, టాంజానియా దేశాలకు వెళ్లాలి. 

అమావాస్య రోజు సూర్యగ్రహణం కదా..? :

మంగళవారం రోజు.. అది కూడా అమావాస్య నాడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సహజంగా ఉండే సూతకాలం ఉంటుందా అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఫిబ్రవరి 17వ తేదీ ఏర్పడే సూర్యగ్రహణం భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపించదు. అసలు ఇండియాలో ఇది కనిపించదు. రాబోయే సూర్య గ్రహణం మన దేశంలోని మనుషులపై ఎలాంటి ప్రభావం చూపించదు. యధావిధిగా అన్ని పనులు చేసుకోవచ్చు. సూతకాలం లేదు.

►ALSO READ | మీ పిల్లలు సైలెంటుగా ఉంటున్నారా ? తల్లిదండ్రులు చేయాల్సింది ఇదే !