సెక్యులర్ పాట పాడాలని నన్ను వేధించారు..బెంగాలీ సింగర్ ఆరోపణ

సెక్యులర్ పాట పాడాలని నన్ను వేధించారు..బెంగాలీ సింగర్ ఆరోపణ

కోల్​కతా: ఒక స్కూల్​లో జరిగిన లైవ్ కాన్సర్ట్​లో సెక్యులర్ పాట పాడాలంటూ ఓ వ్యక్తి తనను వేధించాడని బెంగాలీ సింగర్ లగ్నజిత్ చక్రవర్తి ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. 

శనివారం తూర్పు మిడ్నాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోని భగవాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్​లో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్​లో ఈ ఘటన జరిగిందని ఆమె చెప్పారు. కాన్సర్ట్ లో తాను బెంగాలీ మతపరమైన పాట ‘జాగో మా’ ను పాడుతుండగా మెహబూబ్ మల్లిక్ అనే వ్యక్తి అడ్డు తగిలినట్టు తెలిపారు. 

తనను దుర్భాషలాడుతూ.. దాడి చేసేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. సెక్యులర్ పాటలు పాడాలని తనపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. మల్లిక్ ఆ స్కూల్ ఓనర్ అని, ఈవెంట్ మెయిన్ ఆర్గనైజర్ అని చెప్పారు. సింగర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మల్లిక్ ను అరెస్టు చేశారు.