WPL Final 2026: పాతుకు పోయిన RCB బ్యాటర్లు.. వాల్, మంధాన హాఫ్ సెంచరీలు

WPL Final 2026: పాతుకు పోయిన RCB బ్యాటర్లు.. వాల్, మంధాన హాఫ్ సెంచరీలు

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 లో వెరీ హైటెన్షన్ మ్యాచ్ లో బెంగళూర్ బ్యాటర్లు క్రీజులో పాతుకుపోయారు. ఢిల్లీ నిర్దేశించిన 204 టార్గెట్ దిశగా దూసుకెళ్తున్నారు. ఓపెనర్ జార్జియా వాల్ 37 బాల్స్ లోనే 9  ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. 

మరోవైపు కెప్టెన్ స్మృతి మంధాన మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ.. కేవలం 23 బాల్స్ లోనే అర్థ శతకం పూర్తి చేసింది. ఢిల్లీ బౌలర్లపై విరుచుకు పడుతూ 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 రన్స్ దాటించేసింది. 

ఇక అంతకుముందు ఓపెనర్ గ్రేస్ హారిస్ 9 రన్స్ మాత్రమే చేసి ఔటయ్యింది. చినెల్లీ హెన్రీ బౌలింగ్ లో హారిస్ పెవిలియన్ చేరుకుంది. ప్రస్తుతం 12 ఓవర్లలో బెంగళూర్ స్కోర్ 1 వికెట్ నష్టానికి 124 పరుగులు. 

►ALSO READ | WPL Final 2026: చితక్కొట్టిన ఢిల్లీ బ్యాటర్లు.. ఫైనల్ మ్యాచ్లో 200 దాటిన స్కోర్.. RCB ఛేజ్ చేస్తుందా..?