మూడు సార్లు ఫైనల్ కు చేరుకుని కప్ మిస్ చేసుకున్న ఢిల్లీ.. నాలుగో సారి టైటిల్ గెలవాలనే కసితో చితక్కొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ బ్యాటర్లు.. ఊచకోత కోసినట్లుగా బ్యాట్ ను ఝుళిపిస్తూ RCB బౌలర్లకు చుక్కులు చూపించారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి బెంగళూర్ ముందు 204 రన్స్ భారీ టార్గెట్ ఉంచారు.
ఓపెనర్లు షఫాలీ వర్మ, లిజెల్లీ లీ డ్యాషింగ్ ఓపెనింగ్ ను ఇవ్వడంతో అదే ఊపును మిగతా బ్యాటర్లు కొనసాగించారు. షఫాలీ వ ర్మ13 బాల్స్ లో 20 రన్స్ (3 ఫోర్లు) చేసింది. అరుంధతి రెడ్డి బౌలింగ్ లో49 రన్స్ దగ్గర కీపర్ రిచా ఘోష్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది.
మరో డ్యాషింగ్ ఓపెనర్ లిజెల్లీ లీ 8వ ఓవర్లో 37 రన్స్ (30 బాల్స్ లో) చేసింది. నదినే డి క్లర్క్ బౌలింగ్ లో గ్రేస్ హారిస్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఓపెనింగ్ నుంచి దూకుడుగా ఆడుతూ వచ్చిన లీ.. 3 ఫోర్లు, 3 సిక్సులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది.
ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ జెమీమా రోట్రిగ్జ్.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. కేవలం 32 బాల్స్ లో 7 ఫోర్లతో రన్స్ పూర్తి చేసుకుంది. 15 వ ఓవర్ 5వ బాల్ లో నదినే డి క్లర్క్ వేసిన బాల్ లో సింగిల్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత 16 ఓవర్లో సయాలీ సట్ఘరే బౌలింగ్ లో 57 (37 బాల్స్) నదినే డీ క్లర్క్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యింది.
ఆ తర్వాత లారా వోల్వార్ట్, చినెల్లీ హెన్రీ మంచి పాట్నర్షిప్ కొనసాగిస్తూ.. స్కోర్ బోర్డును 200 పరుగులను దాటించారు. లారా 25 బాల్స్ లో 44 రన్స్ చేసి.. లాస్ట్ బాల్ కు రన్ ఔట్ అయ్యింది. మరో బ్యాటర్ హెన్రీ 15 బాల్స్ లోనే 35 రన్స్ చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. 4 వికెట్లు కోల్పోయి 203 చేసిన ఢిల్లీ ఉమెన్స్ ఫైనల్ లో హైయెస్ట్ స్కోర్ చేసింది.
ఇక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూర్ .. ఢిల్లీని తక్కువ స్కోర్ కు కట్టడి చేయడంలో విఫలమయ్యారు. లారెన్ బెల్ తప్ప అందరూ పరుగులు సమర్పించుకున్నారు. బౌలర్లలో బెంగళూర్ బౌలర్లలో అరుంధతీ రెడ్డీ, డీ క్లర్క్, సయాలీ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
