టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పోలిశెట్టి అంటేనే ఒక వైబ్. 'జాతి రత్నాలు' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ నవ్వుల నవాబు.. ఈసారి 'అనగనగా ఒక రాజు' చిత్రంతో ప్రేక్షకులను ఊపేసాడు. మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నవీన్ తనదైన టైమింగ్‌తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురించారు. దాదాపు రూ. 100 కోట్లకుపై వసూళ్లను రాబట్టింది. కడుపుబ్బ నవ్వించే కామెడీ, పక్కా మాస్ గ్రామీణ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం థియేట్రికల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు డిజిటల్ తెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది.
ఇక ఓటీటీ వంతు!
ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ మొత్తానికి దక్కించుకుంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 13, 2026 నుండి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ప్రేమికుల రోజు (Valentine's Day) కానుకగా ఫిబ్రవరి రెండో వారంలో నవీన్ పోలిశెట్టి తన కామెడీతో ఇంటింటికీ వినోదాన్ని పంచబోతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.
థియేటర్లలో నవ్వుల వర్షం..
ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి సరసన అందాల భామ మీనాక్షి చౌదరి కథానాయికగా నటించి మెప్పించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సీనియర్ యాక్టర్ రావు రమేష్, తారక్ పొన్నప్ప, చమ్మక్ చంద్ర, గోపరాజు రమణ వంటి హేమాహేమీలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా రావు రమేష్, నవీన్ పోలిశెట్టి మధ్య వచ్చే కామెడీ సీన్స్ థియేటర్లలో పేలాయి. మెలోడీ బ్రహ్మ మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌లుగా నిలవగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను ఎలివేట్ చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాయి సౌజన్యతో కలిసి సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
►ALSO READ | Riddhi Kumar : బెజ్ కలర్ చీరలో దేవకన్యలా రిద్ది కుమార్.. చూపుతిప్పుకోనివ్వని ఈ బ్యూటీ అసలు కథ ఇదే!
అసలు కథేంటి?
ఇదొక వినూత్నమైన రూరల్ వెడ్డింగ్ డ్రామా. గ్రామీణ నేపథ్యంలో జరిగే ఒక పెళ్లి, ఆ పెళ్లి చుట్టూ తిరిగే పంతాలు, పట్టింపులు, ఈ క్రమంలో హీరో చేసే హంగామా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. నవీన్ పోలిశెట్టి బాడీ లాంగ్వేజ్, తెలంగాణ స్లాంగ్ డైలాగ్ డెలివరీ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. థియేటర్లలో మిస్ అయిన వారు, మరోసారి ఎంజాయ్ చేయాలనుకునే వారు ఫిబ్రవరి 13 కోసం వేచి చూడాల్సిందే మరి..
