బంగ్లాదేశ్ లో మరో స్టూడెంట్ లీడర్ కాల్చివేత : ఆ దేశం తగలబడిపోతుంది..!

 బంగ్లాదేశ్ లో మరో స్టూడెంట్ లీడర్ కాల్చివేత : ఆ దేశం తగలబడిపోతుంది..!

బంగ్లాదేశ్ దేశం రణరంగంగా మారింది. హాది హత్య తర్వాత మొదలైన అల్లర్లు.. ఆ దేశాన్ని నిలువునా కాల్చేస్తున్నాయి. ఈ నిరసనలు, ఆందోళనలు తగ్గకముందే.. మరో స్టూడెంట్స్ లీడర్ ను కాల్చి చంపారు దుండగులు. బంగ్లాదేశ్ మోతలేబ్ షక్దర్ అనే స్టూడెంట్ లీడర్ ను.. పాయింట్ బ్లాంక్ లో.. తలపై తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన 2025, డిసెంబర్ 22వ తేదీ జరిగింది. 

మోతలేబ్ షక్దర్ నేషనల్ సిటిజన్స్ పార్టీ అనుబంధంగా ఉన్న స్టూడెంట్స్ వింగ్ సీనియర్ కార్యకర్తగా ఉన్నారు. బంగ్లాదేశ్ లోని ఖుల్నా సిటీలో.. 22వ తేదీ సోమవారం ఉదయం ఆయన ఇంటికి వచ్చిన మరీ కాల్చి చంపారు గుర్తుతెలియని దుండగులు. 

ఈ విషయం తెలిసిన వెంటనే.. బంగ్లాదేశ్ లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. స్టూడెంట్స్, కార్మిక సంఘాల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు.

ఎవరీ మోతలేబ్ సిక్దర్ ? 
42 ఏళ్ల మోతలేబ్ సిక్దర్ బంగ్లాదేశ్‌లోని ఖుల్నా ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నేషనల్ సిటిజన్ పార్టీ (NCP) లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

మోతలేబ్ సిక్దర్ పై కాల్పుల ఘటనకు కొద్దిరోజుల ముందే బంగ్లాదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన షరీఫ్ ఉస్మాన్ బిన్ హాది హత్య జరిగింది. 32 ఏళ్ల షరీఫ్ ఉస్మాన్ బిన్ హాది  'ఇంకిలాబ్ మంచా' అనే విద్యార్థి వేదికకు నాయకుడు. మాజీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో ఈయన కీలక పాత్ర పోషించారు.

డిసెంబర్ 12న ఢాకాలోని ఒక మసీదు నుంచి బయటకు వస్తుండగా దుండగులు ఆయనను కాల్చిచంపారు. చికిత్స కోసం సింగపూర్ తరలించినా ఫలితం లేకపోయింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని ముహమ్మద్ యూనస్ ఈ హత్యను తీవ్రంగా ఖండించారు. దేశానికి ఇది "తీరని లోటు" అని పేర్కొంటూ ఒకరోజు సంతాప దినం ప్రకటించారు.

 వరుసగా జరుగుతున్న ఈ దాడులతో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత నెలకొంది. హాది హత్యకు న్యాయం చేయాలని, రాజకీయ నేతలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ప్రజలు ఢాకా వీధుల్లో నిరసనలు తెలుపుతున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఈ దాడులు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.