వెండితెరపై నవ్వుల పూయించే గిన్నిస్ బుక్ విజేత, పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన ఒక సినిమా షూటింగ్‌తోనో, కొత్త మీమ్ తోనో కాకుండా, భారత ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ముని మర్యాదపూర్వకలగా కలిసి వార్తల్లో నిలిచారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతిని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బ్రహ్మానందం కలిశారు. ఈ భేటీ కేవలం ఇద్దరు విశిష్ట వ్యక్తుల మధ్య జరిగిన ఒక ఆత్మీయ కలయికలా సాగింది.
కళాకారుడికి కళాత్మక గౌరవం
సాధారణంగా ప్రముఖులు కలిసినప్పుడు పుష్పగుచ్చాలు ఇచ్చుకోవడం సహజం. కానీ, బ్రహ్మానందం తనదైన శైలిలో ఒక అద్భుతమైన కానుకను రాష్ట్రపతికి అందించారు. తాను స్వయంగా పెన్సిల్ తో గీసిన ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఆమెకు బహుకరించారు. బ్రహ్మానందంలోని చిత్రకారుడి నైపుణ్యాన్ని చూసి రాష్ట్రపతి ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఆయనను శాలువాతో సత్కరించి గౌరవించారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక గొప్ప కళాకారుడికి దక్కిన సరైన గౌరవం అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ALSO READ : బిగ్‌బాస్ 9 ట్రోఫీ మిస్సైనా భారీగా వెనకేసిన తనూజ..
నవ్వుల వెనుక ఉన్న నిశ్శబ్ద చిత్రకారుడు
బ్రహ్మానందం కేవలం డైలాగులతోనే కాదు, కుంచెతోనూ మాయ చేయగలరని ఈ భేటీ మరోసారి నిరూపించింది. గతంలో ఆయన గీసిన వేంకటేశ్వర స్వామి, రాముడి చిత్రాలు చూసి సినీ లోకం అబ్బురపడింది. తన మనసులోని భావాలను కాగితంపై పెన్సిల్ తో ఆవిష్కరించడం ఆయనకు ఇష్టమైన వ్యాపకం. ప్రస్తుతం వయసు రీత్యా సినిమాల వేగం తగ్గించినా, 'రంగమార్తాండ' వంటి చిత్రాల్లో తనలోని భావోద్వేగ నటుడిని పరిచయం చేసి అందరినీ ఏడిపించారు బ్రహ్మానందం.. లేటెస్ట్ గా 'గుర్రం పాపిరెడ్డి' వంటి చిత్రాలతో పలకరిస్తూనే ఉన్నారు.
భారత రాష్ట్రపతి ద్రౌపటి ముర్ము గారిని ఈరోజు హైదరాబాద్ లోని రాష్ట్రపతి నిలయంలో సుప్రసిద్ధ హాస్య నటులు బ్రహ్మానందం గారు కలిశారు. ఈ సందర్భంగా తాను లిఖించిన ఆంజనేయ స్వామి చిత్రాన్ని ఆమెకు బహుకరించారు. రాష్ట్రపతి, ఆయనను శాలువతో సత్కరించారు. #Brahmanandam pic.twitter.com/0ZQjJyjp0y
— Pulagam Chinnarayana (@PulagamOfficial) December 21, 2025
