మున్సిపల్ ఎన్నికల బరిలోకి రాజకీయ వారసులు

మున్సిపల్ ఎన్నికల బరిలోకి రాజకీయ వారసులు
  • వికారాబాద్ నుంచి పోటీలో స్పీకర్ కుమార్తె
  • ఖేడ్ నుంచి ఎంపీ సురేశ్ షెట్కర్ తమ్ముడు, అన్న కుమారుడు 
  • ఆదిలాబాద్ నుంచి జోగు రామన్న కొడుకు ప్రేమేందర్ 
  • రామగుండం నుంచి మాజీ ఎమ్మెల్యే మాలెం మల్లేశం కుమారుడు

మున్సిపల్ ఎన్నికల బరిలోకి రాజకీయ వారసులు దిగారు. దీంతో పురపోరు ఆసక్తికరంగా మారింది. అగ్రనాయకులు పట్టణాల్లోనే బైఠాయించి తమ వారసులను గెలిపించుకునే ప్రయత్నం చేస్తుండటం విశేషం. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కుమార్తె అనన్య వికారాబాద్ మున్సిపల్ 17వ వార్డు అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమె గెలు పుకోసం స్పీకర్ ప్రసాద్ కుమార్ తీవ్రంగా యత్నిస్తున్నారు. అక్కడ ఆమె విజయం సాధిస్తే మున్సిపల్ చైర్ పర్సన్ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం. తన తండ్రి స్పీకర్ గా ఉన్నందున తాను స్థానిక సమస్యలపై  దృష్టి సారించలేక పోతున్నారని, తనను గెలిపి స్తే తాను అందరికీ అందుబాటులో ఉండి వికా రాబాద్ అభివృద్ధికి కృషి చేస్తానంటున్నారు. 

ఇదిలా ఉండగా నారాయణ్ ఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కార్ తమ్ముడు నగేష్ షట్కార్ 8 వార్డు కౌన్సి లర్ గా పోటీ చేస్తున్నారు. ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ అన్న కొడుకు సాగర్ షెట్కర్ ఏడో వార్డు నుంచి బరిలోకి దిగారు. ఎంపీ తమ్ముడు నగేష్ షట్కర్ ఖేడ్ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నా రని సమాచారం. దీంతో పాటు ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మాజీ మంత్రి, బీఆర్ఎ స్ సీనియర్ నేత జోగు రామన్న తనయుడు ప్రేమేందర్ పోటీ చేస్తున్నారు. 34వ వార్డునుం చి బరిలోకి దిగిన ఆయన మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. 

►ALSO READ | BRS నుంచి BJP నేతలు మామూళ్లు తీసుకుంటున్నారు: సీఎం రేవంత్

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 48వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే మాలెం మల్లేశం కుమారుడు మధు బరిలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. 2020 ఎన్నికల్లో మధు 33వ డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి ఓటమి పా లయ్యారు. ఈ సారి గెలుపే లక్ష్యంగా మరో ప్ర యత్నం చేస్తుండటం గమనార్హం. ఏది ఏమైనా మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యనేతల వారసులు బరిలోకి దిగడంతో ఆయా స్థానాలపై అందరి దృష్టి నెలకొంది.