మమతా బెనర్జీకి బిగ్ షాక్.. అన్నంత పని చేసిన TMC బహిష్కృత ఎమ్మెల్యే హుమాయున్..!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. అన్నంత పని చేసిన TMC బహిష్కృత ఎమ్మెల్యే హుమాయున్..!

కోల్‎కతా: అసెంబ్లీ ఎన్నికల వేళ కోల్‎కతా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీఎంసీ బహిష్కృత ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అన్నంత పని చేశాడు. మమతా బెనర్జీ టీఎంసీకి పోటీగా జనతా ఉన్నయన్ పేరుతో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించాడు. సోమవారం (డిసెంబర్ 22) ముర్షిదాబాద్‌ జిల్లాలోని బెల్దంగాలో జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ పేరును అధికారికంగా ప్రకటించాడు. 

రెజినగర్, భరత్‌పూర్ రెండు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి తాను పోటీ చేస్తానని హుమాయున్ కబీర్ స్పష్టం చేశారు. అంతేకాకుండా తన పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న కొందరు అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించాడు. ముర్షిదాబాద్ జిల్లాలో బాబ్రీ మసీద్ నమూనాలో కొత్త మసీదు నిర్మిస్తానని ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ ప్రకటించడంతో అతడిని టీఎంసీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.

టీఎంసీ నుంచి సస్పెండ్ కావడంతో మమతా బెనర్జీకి పోటీగా కొత్త పార్టీ పెడతానని ప్రకటించాడు. అన్నట్లుగానే జనతా ఉన్నయన్ పేరుతో కొత్త పొలిటికల్ పార్టీ ఫామ్ చేశాడు. గత కొంతకాలంగా మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి మద్దతుగా ఉంటూ వస్తోన్న ముస్లిం ఓటు బ్యాంక్ హుమాయున్ కబీర్ కొత్త పార్టీ ప్రకటనతో చీలే అవకాశం ఉందన్నంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ALSO READ : బంగ్లాదేశ్ లో మరో స్టూడెంట్ లీడర్ కాల్చివేత

ముర్షిదాబాద్‌లో బాబ్రీ మసీదు నిర్మించాలనుకోవడం పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేస్తూ.. అశాంతిని సృష్టించడమేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపైన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ రియాక్ట్ అయ్యారు. ముర్షిదాబాద్ లో బాబ్రీ తరహాలో మసీదు నిర్మిస్తే అల్లర్లు జరుగుతాయని మోహన్ భగవత్ అంటున్నారు కానీ అలాంటిది జరగనివ్వమని అన్నారు.

సీఎం మమతా బెనర్జీకి ఆర్ఎస్ఎస్‎తో సంబంధాలు ఉన్నాయని.. అందుకే మోహన్ భగవత్ ఇటీవల15 రోజుల పాటు బెంగాల్‎లో సందర్శించారని ఆరోపించారు. మమతా బెనర్జీ సహయం చేయడంతోనే బెంగాల్‎లో ఆర్ఎస్ఎస్ శాఖలు 558 నుంచి 12 వేలకు చేరుకున్నాయని ఆరోపణలు చేశారు.