ప్రజాప్రతినిధులందరికీ డ్రగ్స్ టెస్ట్ నిర్వహించాలి : మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి 

ప్రజాప్రతినిధులందరికీ డ్రగ్స్ టెస్ట్ నిర్వహించాలి : మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి 

బషీర్‌‌‌‌బాగ్, వెలుగు :  ప్రజాప్రతినిధులందరికీ డ్రగ్స్ టెస్ట్ నిర్వహించాలని ఖైరతాబాద్​ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి అన్నారు. ఈ డిమాండ్​ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎప్పటి నుంచో చేస్తున్నారన్నారు.

హిమాయత్‌‌‌‌నగర్‌‌‌‌లో బీజేపీ ఓబీసీ మోర్చా హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి కేశబోయిన శ్రీధర్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించగా చింతల పాల్గొని  పారిశుధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. బీజేపీ సిటీ ఇన్‌‌‌‌చార్జి చంద్రశేఖర్, హిమాయత్‌‌‌‌నగర్ డివిజన్ అధ్యక్షురాలు మాధవి, సిటీ వైస్ ప్రెసిడెంట్ పి.ప్రసాద్, సిటీ సెక్రటరీ నర్సింగ్ ముదిరాజ్ పాల్గొన్నారు.